విద్యార్థి దశనుంచే శాస్త్రీయ విజ్ఞానాన్ని నేర్చుకోవాలి

ABN , First Publish Date - 2022-12-10T00:38:09+05:30 IST

ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ విజ్ఞానాన్ని నేర్చుకోవాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు.

 విద్యార్థి దశనుంచే శాస్త్రీయ విజ్ఞానాన్ని నేర్చుకోవాలి
మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే

సిరిసిల్ల రూరల్‌, డిసెంబరు 9: ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ విజ్ఞానాన్ని నేర్చుకోవాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని రగుడు శివారులో రంగినేని సుజాత మోహన్‌రావు ఎడ్యుకేషన్‌, చారిటబుల్‌ ట్రస్ట్‌లో జన విజ్ఞాన వేదిక తెలంగాణ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలను శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర అధ్యక్షుడు కోయ వెంకటేశ్వర్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నేటి సమాజంలో శాస్త్రీయ జ్ఞానం లోపించడంతో మూఢనమ్మకాలు, పెరిగిపోతున్నాయన్నారు. సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ సీహెచ్‌మోహన్‌రావు మాట్లాడుతూ సైన్స్‌ను అధ్యయనం చేస్తే గొప్ప శాస్త్రవేత్తగా రాణించవచ్చన్నారు. అంతకుముందు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, బాల సాహితీవేత్త పత్తిపాక మోహన్‌, ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు రంగినేని మోహన్‌రావు, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ విశ్వప్రసాద్‌, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్‌, కోశాధికారి వరప్రసాద్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు సి.రామరాజు, జిల్లా కమిటీ అధ్యక్షుడు గుర్రం అంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపతి రమేష్‌, గౌరవ అధ్యక్షుడు మార్వాడి గంగారాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:38:24+05:30 IST