ధరణి సమస్యల పరిష్కారానికి రెవెన్యూ ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-11-19T00:04:46+05:30 IST

రాష్ట్రంలో నెలకొన్న ధరణి సమస్యల పరిష్కా రానికి జిల్లాకో రెవెన్యూ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ధరణి సమస్యల పరిష్కారానికి రెవెన్యూ ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు చేయాలి

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల అర్బన్‌, నవంబరు 18: రాష్ట్రంలో నెలకొన్న ధరణి సమస్యల పరిష్కా రానికి జిల్లాకో రెవెన్యూ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఉన్న భూ చట్టాలకు భి న్నంగా తెచ్చిన ధరణి చట్టం భూ సమస్యలకు నిలయంగా మారిందన్నారు. ఏదై నా చట్టమో, ఆన్‌లైన్‌ సైట్‌ రూపకల్పన చేస్తే అది గతంలో ఉన్నదానికన్నా మెరు గ్గా ఉండాలే తప్ప, రెవెన్యూ యాక్ట్‌లో లేని సమస్యలను ధరణి సాప్ట్‌వేర్‌తో తెరపై కి వచ్చాయన్నారు. కింది స్ధాయి అధికారులు ఏదైన పొరపాట్లు చేస్తే అప్పీళ్ల ద్వా రా గతంలో పరిష్కారానికి అవకాశం ఉండేదని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అధికా రాలన్నీ పోవడమే కాకుండా సవరణకు కూడా అవకాశం లేకపోవడం ప్రభుత్వ పనితీరు, పారదర్శకతకు నిదర్శనం అన్నారు. మూడేళ్లు గడిచిన ధరణి భూ సమ స్యలకు పరిష్కారం చూపడం లేదని, 10శాతం కూడా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని జీవన్‌రెడ్డి ఆరోపించారు. రెవెన్యూ వ్యవస్థలో అప్పిల్‌లకు అవ కాశం లేకుండా భూసమస్యలు పరిష్కరించే రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధి స్తుందని ఎద్దేవా చేశారు. ధరణి విధానంతో సివిల్‌ ప్రోసీజర్‌ కోడ్‌ అమలుకు అవ కాశం లేకుండా పోయిందని, గతంలో 1బి ద్వారా భూముల వివరాలు స్పష్టంగా తెలిసేవని, ప్రసుత్తం సీఎం కేసీఆర్‌కు ఎంత భూమి ఉందో తెలియకుండా ఉం డేందుకే ఆ ప్రొవిజన్‌నే మాయం చేశాడని, ఇది ధరణి పనితీరుకు, ప్రభుత్వ పార దర్శకతకు నిదర్శనం అన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో గ్రామాల్లో ప్రభుత్వమే లే కుండా పోయిందని, అడ్జెస్ట్‌ విధానంతో ఖాళీలను భర్తీ చేసి, నిరుద్యోగులను దొం గదెబ్బ కోట్టాడని విమర్శించారు. భూముల సమస్యల పరిష్కారానికి ఆన్‌లైన్‌ విధా నంతో పాటు, గ్రామీణ ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆఫ్‌లైన్‌ విధానం లో సైతం దరఖాస్తు స్వీకరణ ఉండేలా చూడాలన్నారు. కనీసం ప్రజా ప్రతినిఽధు లు పెట్టిన దరఖాస్తులకు సైతం తిరస్కరణ సమాధానం తప్ప, ఎందుకు తిరస్క రించారో పేర్కొనడం లేదని, ప్రతి దరఖాస్తుకు లిఖిత పూర్వక సమాధానం ఉం డేలా చొరవచూపాలని ప్రభుత్వాన్ని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ సమావేశం లో నాయకులు గిరినాగభూషణం, కొత్త మోహన్‌, సిరాజుద్దీన్‌ మన్సూర్‌, గాజుల రాజేంధర్‌, పుప్పాల అశోక్‌, రాధాకిషన్‌రావు, రమేష్‌బాబు, రఘువీర్‌ గౌడ్‌, గుంఢా మధు, మహేష్‌, ప్రకాష్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-11-19T00:04:48+05:30 IST