బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

ABN , First Publish Date - 2022-08-18T05:27:36+05:30 IST

రాష్ట్రంలో వరుసగా న్యాయవాదుల హత్యలను, దాడులను నిరసిస్తూ గోదావరిఖని బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం మున్సిఫ్‌ కోర్టు ఎదురుగా రిలే నిరాహార దీక్షలను బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు సీహెచ్‌ శైలజ ప్రారంభించారు.

బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
దీక్ష చేస్తున్న న్యాయవాదులు

- న్యాయవాదుల హత్యలు, దాడులపై నిరసన

కోల్‌సిటీ, ఆగస్టు 17: రాష్ట్రంలో వరుసగా న్యాయవాదుల హత్యలను, దాడులను నిరసిస్తూ గోదావరిఖని బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం మున్సిఫ్‌ కోర్టు  ఎదురుగా రిలే నిరాహార దీక్షలను బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు సీహెచ్‌ శైలజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా న్యాయవాదుల హత్య లు జరగడం హేయమైన చర్య అని, ప్రభుత్వం వెంటనే న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని అమలుకు తీసుకురావాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలో న్యాయవా దులు పాత అశోక్‌, గొర్రె రమేష్‌, అనురాధ, మురళి, శ్రీనివాస్‌, వరలక్ష్మి, ఎంచర్ల మహేష్‌, విక్రమ్‌సింగ్‌, షర్మిల, షాన్వాజ్‌ దీక్ష చేపట్టారు. బార్‌ అసోసియేషన్‌ కార్య దర్శి జవ్వాజి శ్రీనివాస్‌, నుచ్చు శ్రీనివాస్‌, ఎండీ ఉమర్‌, పెట్టం వెంకటేష్‌, కిషన్‌ రావు, ప్రకాష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T05:27:36+05:30 IST