‘డబుల్‌’ నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ABN , First Publish Date - 2022-03-23T05:37:08+05:30 IST

డబుల్‌ ఇళ్ల నిర్మాణాల్లో కాంట్రాక్టర్‌ నాణ్యత, ప్రమాణాలు పాటించేలా అధికారులు తరచుగా పనులను పరి శీలించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు.

‘డబుల్‌’ నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, మార్చి 22 :డబుల్‌ ఇళ్ల నిర్మాణాల్లో కాంట్రాక్టర్‌ నాణ్యత, ప్రమాణాలు పాటించేలా అధికారులు తరచుగా పనులను పరి శీలించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. పట్టణ శివారులో ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4520 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల ఇర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో కలిసి పరి శీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలు పూరైన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి ఆడబిడ్డ ల పేరుపై అందిస్తామన్నారు. పేదలకు త్వరలోనే సొంతింటి కల నేరవే రబోతోందన్నారు. పక్కా ప్రణాళికలతో ఇళ్ల నిర్మాణాల పనులను వేగవం తం చేస్తున్నామని, అవసరమైన అన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. 

Read more