విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ABN , First Publish Date - 2022-08-17T06:00:39+05:30 IST

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 16: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు.  అనంతరం మండల కేంద్రంలో వృద్ధుల డే కేర్‌ సెంటర్‌ను పరిశీలించారు.  మండలంలోని మోడల్‌ క్రీడా ప్రాంగణ ఏర్పాట్ల పురోగతిని ఎంపీడీవో చిరంజీవిని అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.  డీఈవో రాధాకిషన్‌, పంచాయతీరాజ్‌ ఈఈ సూర్యప్రకాష్‌, ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, ఎమ్మార్వో జయంత్‌కుమార్‌, ఎంపీడీవో చిరంజీవి, పీఆర్‌డీఈ శ్రీనివాస్‌, ఏఈ సాయికృష్ణ, పీఏసీఎస్‌ చైర్మన్‌కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. 

Read more