కృత్యాధార బోధనతో గుణాత్మక విద్యనందించాలి

ABN , First Publish Date - 2022-03-23T05:54:39+05:30 IST

విద్యార్థులకు పాఠశాల స్థాయిలో ప్రయోగాలు, కృత్యాధార బోధనతో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందిం చి గుణాత్మక విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా విద్యాశాఖాధికారి మాధవి అన్నారు.

కృత్యాధార బోధనతో గుణాత్మక విద్యనందించాలి
విద్యార్థులను వివరాలు అడుగుతున్న డీఈవో మాధవి

- డీఈవో మాధవి 

పెద్దపల్లి రూరల్‌, మార్చి 22 : విద్యార్థులకు పాఠశాల స్థాయిలో ప్రయోగాలు, కృత్యాధార బోధనతో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందిం చి గుణాత్మక విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా విద్యాశాఖాధికారి మాధవి అన్నారు. మంగళ వారం మండలంలోని బోంపల్లి గ్రామంలోని జిల్లా, మండల పరిషత పాఠశాలలో సైన్సఫెస్ట్‌ పేరుతో వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటుచేశారు. ఈసంధర్బంగా ముఖ్యఅతిథిగా జిల్లా విద్యా శాఖాధికారి మాధవి హాజరై విద్యార్థులు చేసిన పలు ప్రయో గాలను పరిశీలించారు. డీఈవో మాట్లాడుతూ కఠినమైన అం శాలను సులువుగా అర్థమయ్యే రీతిలో బోధన అందించేందు కు ఈ విధానం దోహదపడుతుందన్నారు. భౌతిక,రసాయన, సాంఘిక శాసా్త్రలకు సంబంధించిన ఎగ్జిబిట్లను తక్కువ ఖర్చుతో విద్యార్థులు రూపొందించిన తీరు సందర్శకులను ఆకట్టుకున్నాయని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్ర మంలో జిల్లా సైన్స అధికారి రఘునందనరావు, గ్రామ సర్పం చ అరికిల్ల లక్ష్మయ్య, ఉపసర్పంచ వూరడి లక్ష్మయ్య, మండల విద్యాధికారి సురేంద్రకుమార్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మ హేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు ప్రకాష్‌రావు, శారద, మం జుల, వర ప్రసాద్‌, విద్యార్థులు పాల్గొన్నారు.  

Read more