ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2022-10-01T05:07:09+05:30 IST

ప్రజాప్రతినిధులు, అఽధికారులు సమన్వయంతో పని చేసినప్పుడు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌ అన్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవిశంకర్‌

- ఎమ్మెల్యే రవిశంకర్‌

కొడిమ్యాల, సెప్టెంబరు 30: ప్రజాప్రతినిధులు, అఽధికారులు సమన్వయంతో పని చేసినప్పుడు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌ అన్నారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ స్వర్ణలత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు చేసిన కృషితోనె మండలానికి అవార్డులు వచ్చాయన్నారు. ప్రజల సమస్యలు ప్రజాప్రతినిధులు అఽధికారుల దృష్టికి తీసుకరాగానే వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కూడా జగిత్యాల జిల్లాకు అవార్డు అవార్డు రావటం జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి ఫలితమె అన్నారు. భవిష్యత్తులో సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలన్నారు. అంతక ముందు ఎంపీటీసీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ కొడిమ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమున్న వారు వెళ్తే సిబ్బంది ఇష్టమున్న మాత్రలను ఇవ్వటంతో వారు ఇబ్బదులు ఎదుర్కొన్నారని, దీర్ఘకాలిక రోగులకు అవసరం ఉన్న మందులను అందించాలని అధికారుల దృష్టికి తీసుకవచ్చారు. 


మరోసారి అలాంటివి జరుగకుండా చూసుకుంటామని సీహెచ్‌వో రాజశేఖర్‌ సమాదానమిచ్చారు. మండలంలో కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని హిమ్మతురావుపేట ఎంపీటీసీ జగన్‌మొహన్‌రెడ్డి అధికారులను కోరారు. శ్రీరాములపల్లిలో రెండేళ్లుగా విద్యుత్‌ స్తంబాలు ఏర్పాటు చేయాలని కోరినా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామ ఇన్‌చార్జి సర్పంచ్‌ చల్ల శ్రీనివాసరెడ్డ్డి అన్నారు. చెప్యాల ఎక్స్‌ రోడ్డు వద్ద తాగు నీటి సౌకర్యం కల్పించాలని ఎంపీటీసీ మల్లారెడ్డి అధికారులను కోరారు. సమావేశంలో ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ ప్రశాంతి, ఎంపీడీవో పద్మజరాణి, తహసీల్దారు స్వర్ణ, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణారావు, సింగిల్‌ విండోల చైర్మన్‌లు రాజనర్సింగరావు, రాజేందర్‌, ఉపాధ్యక్షుడు ప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు, వివిద గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T05:07:09+05:30 IST