పారిశుధ్యం అమల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి

ABN , First Publish Date - 2022-08-21T05:40:48+05:30 IST

పారిశుధ్యం అమల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు.

పారిశుధ్యం అమల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి
దోమల నివారణ స్ర్ఫే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, చైర్‌ పర్సన్‌

ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, ఆగస్టు 20 : పారిశుధ్యం అమల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని 34వ, వార్డులో శనివారం సీజనల్‌ వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగం గా దోమల నివారణ స్ర్పే కార్యక్రమాన్ని బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావ ణితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. పట్టణంలోని అన్ని వార్డు ల్లో నిత్యం ఫాగింగ్‌తో పాటు దోమల నివారణ స్ర్పే చేయించాలన్నారు. ప్ర జల భాగస్వామ్యంతోనే పట్టణ ప్రగతి సాధ్యమవు తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకో వాలన్నారు. గత నాయకుల నిర్లక్ష్యంతోనే పట్టణం పూర్తిగా వెనుకబడి డ్రైనే జీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్‌ పిట్ట ధర్మరాజు, కూసరి అనీల్‌, అల్లె గంగాసాగర్‌, సిరి కొండ పధ్మ, కమిషనర్‌ స్వరూప రాణి, యూత్‌ అధ్యక్షుడు గిరి, మహిళా విభాగం అధ్యక్షురాలు కచ్చు లత, రైతు విభాగం నాయకుడు బండారి నరేందర్‌ ఉ న్నారు. టీఆర్‌ఎస్‌ యూత్‌ ఉపాధ్యక్షుడు రాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా పరామర్శించారు. తోట మల్లిఖార్జున్‌, గంగమల్లు ఉన్నారు.

Read more