-
-
Home » Telangana » Karimnagar » Public appeals should be dealt with promptly-NGTS-Telangana
-
ప్రజావాణి విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-10-04T06:27:18+05:30 IST
ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులను జిల్లా అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఇద్దరి నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.

కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల కలెక్టరేట్, అక్టోబరు3: ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులను జిల్లా అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఇద్దరి నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాటా ్లడుతూ జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు ప్రజల సమస్యలపై వచ్చిన విజ్ఞప్తులపై స్పందించి సత్వర పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. అధికారుల సమన్వయంతో పనిచేస్తూ ప్రజల వినతులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్ర మంలో జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, వేములవాడ ఆర్డీవో పవన్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.