విద్యారంగ పరిరక్షణ అందరి భాధ్యత

ABN , First Publish Date - 2022-12-12T01:00:00+05:30 IST

రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి దయనీయంగా మారిందని, దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌ అన్నారు.

విద్యారంగ పరిరక్షణ అందరి భాధ్యత
ప్రమాణ స్వీకారం చేస్తున్న నూతన కమిటీ బాధ్యులు

టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 11: రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి దయనీయంగా మారిందని, దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక టీచర్స్‌ భవన్‌లో టీఎస్‌యూటీఎఫ్‌ 4వ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను దూరం చేసేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొ ట్టాలని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో బడ్జెట్‌ను తగ్గిస్తూ, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు. కేంద్రం జాతీయ విద్యా విధానం ముసుగులో నిరుపేదలకు స్థానిక విద్యకు అవకాశం లేకుండా కార్పొ రేటీకరణ దిశగా అడుగులు వేస్తుందని దుయ్యబట్టారు. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను మూసివేయడం అంటే ఉపాధ్యాయ నియామకాలు భవిష్యత్‌లో లేకుండా చేయడమేన నన్నారు. ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించి వారి భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని ఆ స్ఫూర్తి ఈ మహాసభల ద్వారా పొందా లని పిలుపునిచ్చారు. అనంతరం విద్యారంగ పరిరక్షణకు భవిష్యత్‌ కార్యాచరణపై సుధీర్ఘంగా చర్చించి పలు అంశాలపై తీర్మాణం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్‌, శ్రీధర్‌తో పాటు వివిధ మండలాల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నూతన జిల్లా కమిటీ ఎన్నిక

టీఎస్‌యూటీఎఫ్‌ జగిత్యాల జిల్లా నూతన కమిటీని సమావేశం అనంతరం ఆది వారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తిరుక్కోవెల శ్యాం సుందర్‌, ప్రధాన కార్యదర్శిగా అంబటి భూమేశ్వర్‌, ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌, సుశీల, కోశాధికారిగా మానుపాటి బన్న, కార్యదర్శులుగా తులసీ ఆగమయ్య, నరేష్‌, పివి ప్రసాద్‌, శ్రీనివా స్‌రావు, శోభారాణి, శ్రీధర్‌, ఎండీ ఖలీద్‌ పాషా, శ్రీనివాస్‌, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ జ యంత్‌కుమార్‌, సభ్యులు సిరిపురం శ్రీనివాస్‌, శంకర్‌ తదితరులున్నారు. నూతన కమి టీచే రాష్ట్ర బాధ్యులు ప్రమాణ స్వీకారం చేయించగా, ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్య దర్శి గోల్కొండ శ్రీధర్‌ వ్యవహరించారు. అనంతరం నూతన కమిటిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-12-12T01:00:00+05:30 IST

Read more