ఆసరా కల్పించి...తొలగించి

ABN , First Publish Date - 2022-10-12T05:38:14+05:30 IST

ప్రభుత్వం ఆసరా పథకం కింద పింఛన్లు కావాలని గతంలో పలువురు దరఖాస్తు చేసుకున్నారు.

ఆసరా కల్పించి...తొలగించి

- జిల్లాలో కొత్తగా 31,557 పింఛన్లు

-  అనర్హులుగా గుర్తించి తొలగించినవి 2312

వెనక్కి తీసుకుంటున్న ఆసరా కార్డులు

- ఆందోళన చెందుతున్న పింఛన్‌దారులు

జగిత్యాల, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఆసరా పథకం కింద పింఛన్లు కావాలని గతంలో పలువురు దరఖాస్తు చేసుకున్నారు. దరఖా స్తుల పరిశీలన సైతం అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వం ఎప్పుడెప్పు డు పింఛన్‌ మంజూరు చేస్తుందా అని ఏళ్ల తరబడి ఎదురుచూశారు. కొ విడ్‌ మహమ్మారికి బలై కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, వయస్సు మీరి మరికొందరు, తదితర కారాణాల పలువురు మృతి చెందారు. ఈ నే పథ్యంలో సీఎం కేసీఆర్‌ ఎట్టకేలకు ఆసరా పింఛన్లను మంజూరు చేస్తున్న ట్లు ప్రకటించారు. అధికారులు హడావిడిగా వివరాలను ప్రభుత్వానికి అం దించారు. దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ జరపకుండా ప్రభుత్వం అర్హుల జాబితాను ప్రకటించింది. జాబితాలో కొందరు మృతి చెందిన వారి పేర్లు సైతం వచ్చాయి. ఒకే ఇంట్లో రెండేసి పింఛన్లు కొందరివి, అనర్హులవి కొందరివి జాబితాలో వచ్చాయి. కొంత ఆలస్యంగా గుర్తించిన అధికార యంత్రాంగం మృతి చెందిన వారివి, డబుల్‌ వచ్చిన వారివి, అనర్హులవి గుర్తించి వాటి తొలగింపునకు చర్యలు చేపట్టింది. 

హడావిడిగా వివరాల సేకరణ..

ఇటీవల జిల్లా వ్యాప్తంగా అన్ని రకాలు కలిపి 31,657 పింఛన్లు కొత్తగా మంజూరు అయ్యాయి. లబ్ధిదారుల జాబితా మండల పరిషత్‌, మున్సిపల్‌, పంచాయతీలకు పంపించారు. లబ్ధిదారుల జాబితా ఆధారంగా వారివారి బ్యాంకు అకౌంట్లలో పింఛన్‌ డబ్బులను విడతల వారిగా జమ చేస్తున్నా రు. మృతి చెందిన వారి పేర్లపైనా పింఛన్లు అందుతున్నాయన్న ఫిర్యాదు లు రావడంతో విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనికి తోడు ప్రభుత్వం సైతం సీరియస్‌గా తీసుకొని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శు లు, మున్సిపాల్టీల్లో మెప్మా సిబ్బందిచే పక్కాగా సర్వే చేయించారు. జా బితాలో ఉన్న లబ్ధిదారులకు, సెల్‌ నంబర్లకు కాల్‌ చేసి సంబంధిత వ్యక్తు లు ఉన్నారా..వలస వెళ్లారా..చని పోయారా అని ఆరా తీసి వివరాలను న మోదు చేశారు. కొత్తగా ఆసరా పింఛన్‌ మంజూరైన వారిలో అనర్హులను, మృతి చెందిన వ్యక్తులను, రెండేసి చొప్పున వచ్చిన వ్యక్తుల జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి అందించారు. జాబితా నుంచి అధికారులు ప్ర తిపాదించిన పేర్లను ప్రభుత్వం తొలగించింది. 

కొత్తగా మంజూరైనవి..

జిల్లాలో ఇటీవల ప్రభుత్వం 31,557 మందికి ఆసరా పింఛన్‌ను మం జూరు చేసింది. 57 ఏళ్లు నిండిన వ్యక్తులకు సైతం వృద్ధాప్య పింఛన్లను అందిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో 19,736 మం దికి 57 ఏళ్లు నిండిన వృద్ధుల కేటగిరిలో కొత్తగా మంజూరు ఇచ్చారు. వీ రితో పాటు 2,679 వృద్ధాప్య, 5,488 వితంతు, 1,606 దివ్యాంగులు, 519 గీ త కార్మికులు, 512 చేనేత కార్మికులు, 236 ఒంటరి మహిళలు, 355 బీడీ కార్మికులు, 219 ఎయిడ్స్‌ బాధితులు, 207 బోదకాల బాధితులకు, 100 డ యాలిసిస్‌ పేషంట్లకు కొత్తగా పింఛన్లను మంజూరు చేసింది.  

తొలగించిన పింఛన్లు 2,312...

జిల్లాలో కొత్తగా మంజూరైన జాబితా నుంచి అధికారులు ఇటీవల 2,312 మంది పేర్లను తొలగించారు. ఇందులో మృతి చెందినట్లుగా గుర్తిం చిన వారి సంఖ్య 625, వివిధ కారణాల వల్ల అనర్హులుగా గుర్తించినవి 1,687 మందిని గుర్తించి తొలగించారు. దీంతో జిల్లాలో కొత్తగా మంజూరు అయిన పింఛన్ల సంఖ్య 29,345గా ఉంది. నూతనంగా పింఛన్‌ మంజూరు అయిన అర్హులైన జాబితాలో ఉన్నవారి బ్యాంకు ఖాతాల్లో ఇటీవల పింఛన్‌ డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. జాబితా నుంచి తొలగించిన వ్యక్తు ల కు అందించిన ఆసరా కార్డులను అధికారులు వెనక్కు తీసుకుంటున్నారు. కార్డులను తిరిగి ఇవ్వడానికి కొందరు ముందుకు రావడం లేదు. ప్రభు త్వం ఆసరా పథకం కింద పింఛన్‌ ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి తీసుకోవడం ప ట్ల అసంతృప్తి చెందుతున్నారు. అధికారులు మరోమారు సమగ్రంగా వివ రాలను సేకరించి అర్హులందరికీ పింఛన్‌ అందివ్వాలని కోరుతున్నారు.

అనర్హులకు పింఛన్లు అందవు

- వినోద్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఆసరా పింఛన్‌ జాబితాలో కొం దరు అనర్హులు, మృతి చెందిన వారు సైతం ఉన్నట్లుగా గుర్తించాం. సం బంధిత వ్యక్తులకు పింఛన్‌ డబ్బులు అందవు. రాష్ట్ర స్థాయిలోనే అనర్హుల ను జాబితా నుంచి తొలగిస్తున్నారు. అర్హులైన వ్యక్తులకు పింఛన్‌ అందే లా చర్యలు తీసుకుంటున్నాము.

Read more