ప్రజా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం

ABN , First Publish Date - 2022-07-04T05:17:22+05:30 IST

ప్రజా పోరాటాలతో సమస్య లు పరిష్కారం అవుతాయని, పార్టీ శ్రేణులను, ప్రజల ను పోరాటాల్లో భాగస్వామ్యం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్‌ పిలుపునిచ్చారు.

ప్రజా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేస్తున్న సీపీఐ నాయకులు

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్‌

గోదావరిఖని, జూలై 3: ప్రజా పోరాటాలతో సమస్య లు పరిష్కారం అవుతాయని, పార్టీ శ్రేణులను, ప్రజల ను పోరాటాల్లో భాగస్వామ్యం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక భాస్కర్‌రావు భవన్‌లో సీపీఐ రామగుండం నగర సమితి మూడవ మహాసభలు జరిగాయి. ఈ మహాసభలో సీపీఐ సీనియర్‌ నాయకులు కే స్వామి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించగా, అమరవీరుల స్థూపానికి తాండ్ర సదానందం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో కలవేని శంకర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8ఏళ్లు గడుస్తున్నా విదే శాల్లో ఉన్న లక్షల కోట్ల నల్ల ధనాన్ని వెనక్కి తీసుకురా లేదని ఆయన విమర్శించారు. హామీలను అమలు చేయకుండా యువతను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో దేశంలో పేదరి కం బాగా పెరిగిందన్నారు. కరోనా తరువాత దేశంలో ధనికులు మరింత ధనికులుగా, పేదలు మరింత పేదలుగా మారారని ఆయ న ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చి న తరువాత మతం పేరుతో ప్రజలను విడదీస్తూ మతోన్మాదాన్ని పెంచిపోషిస్తున్నదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ఎన్ని కల్లో ప్రజకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని తీవ్రంగా విమ ర్శించారు. అనంతరం జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లా డుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్ప డుతూ అధికధరలు పెంచాయని, ప్రజలపై ఆర్థిక భారం మోపారని ఆరోపించారు. రామగుండం కార్పొరేషన్‌ నెలకొన్న సమస్యలు, డబు ల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు, పెన్షన్లు తదితర సమస్యల పరిష్కారా నికి పోరాటాలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ప్రజా నాట్య మండలి కళాకారులు వై లెనిన్‌, రొంటల లింగయ్య, సంబోజు కొము రయ్యలు ఉద్యమ గేయాలు ఆలపించారు. మాటేటి శంకర్‌ అధ్యక్ష తన జరిగిన ఈ మహాసభలో నాయకులు గౌతం గోవర్ధన్‌, గోషిక మోహన్‌, కే కనక రాజు, తాళ్లపల్లి మల్లయ్య, మద్దెల దినేష్‌, మడ్డి ఎలాగౌడ్‌, ప్రమీలదేవి, మడికొండ ఓదమ్మ పాల్గొన్నారు. 

Read more