ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధం

ABN , First Publish Date - 2022-08-21T06:24:28+05:30 IST

ప్రజల పక్షాన పోరాటానికి కమ్యునిస్టు పార్టీ సిద్ధంగా ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు.

ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధం
సమావేశంలో మాట్లాడుతున్న మర్రి వెంకటస్వామి

-సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

భగత్‌నగర్‌, ఆగస్టు 20: ప్రజల పక్షాన పోరాటానికి కమ్యునిస్టు పార్టీ సిద్ధంగా ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. శనివారం నగరంలోని సీపీఐ కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్రమైన సంక్షోభంలో నెట్టి వేయబడ్డారన్నారు. కేసీఆర్‌ నియంతృత్వ అరాచక పోకడలు మిన్నంటాయన్నారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో కరీంనగర్‌లో రియల్‌ మాఫి యా రాజ్యమేలుతోందన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు సకాలంలో రావడం లేదని, ఆసుపత్రిలో పరికరాలు సైతం సరిగా లేవన్నారు. ప్రభుత్వ వైద్యులు పనిచేయడం లేదని, ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ కొనసాగుతోందన్నారు. నగరంలో విచ్చలవిడిగా ప్రైవేట్‌ ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చారన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇప్పిస్తామని కొంత మంది కార్పొరేటర్లు  డబ్బులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీపీఐ మహాసభలో ప్రభుత్వం ప్రలజకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పలు తీర్మానాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ సమావేశంలో పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్‌కుమార్‌, బోయిని అశోక్‌, టేకుమల్ల సమ్మయ్య, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, బ్రాహ్మండ్లపల్లి యుగేందర్‌, కసిరెడ్డి మణికంఠరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read more