గ్రూప్‌-1 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయండి

ABN , First Publish Date - 2022-09-25T06:13:35+05:30 IST

గ్రూప్‌-1 పరీక్షలను అక్టోబరు 16న నిర్వహించనున్నామని, పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు.

గ్రూప్‌-1 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

- సీసీ కెమెరాలను కచ్చితంగా ఏర్పాటు చేయాలి

- కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గ్రూప్‌-1 పరీక్షలను అక్టోబరు 16న నిర్వహించనున్నామని, పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో గ్రూప్‌-1 పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేయవలసిన వసతులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ  జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలను గుర్తించామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో అభ్యర్థులందరూ స్పష్టంగా కనబడేలా సీసీ కెమెరాలను కచ్చితంగా అమర్చాలని, టాయిలెట్లు, మంచినీరు, విద్యుత్‌ మొదలగు సదుపాయాలలో ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. పరీక్షా కేంద్రాలను అక్టోబరు 10 వరకు సిద్ధం చేయాలని తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగేలా పోలీసులతోపాటు ఆర్డీవో, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు అనుక్షణం పర్యవేక్షించాలని అన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, డీఐఈవో టి రాజ్యలక్ష్మి, తిమ్మాపూర్‌ తహసీల్దార్‌ కనుకయ్య, ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ పాల్గొన్నారు. 

Read more