ప్రజాకవి కాళోజీని స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-10T06:43:18+05:30 IST

ప్రజాకవి కాళోజీని యువత ఆదర్శంగా తీసుకోవాలని జడ్పీచైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ సూచించారు.

ప్రజాకవి కాళోజీని స్ఫూర్తిగా తీసుకోవాలి
కాళోజీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌

- జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ 

- ఘనంగా మహాకవి కాళోజీ జయంతి వేడుకలు

సిరిసిల్ల సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రజాకవి కాళోజీని యువత ఆదర్శంగా తీసుకోవాలని జడ్పీచైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ సూచించారు. కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా  ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయంలో కాళోజీ చిత్రపటా నికి జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ పూలమా లలు వేసి నివాళి తెలిపారు. కలెక్టరేట్‌లో  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ రాహూల్‌హెగ్డే, అదనపు ఎస్పీ చంద్రయ్య, 17వ పోలీస్‌ బెటాలియన్‌ కార్యాలయంలో కమాండెంట్‌ సుబ్రమ్మణ్యం, అసిస్టెం ట్‌ కమాడెంట్‌ ఎం పార్థసారధి, మున్సిపల్‌ కార్యాల యంలో చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ మాట్లాడుతూ ప్రజాకవి కాళోజీని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాళోజీ రచనలు ప్రజల్ని ఎంతో చైతన్య పరచాయన్నారు. ప్రజా సమస్యలపైన ఆయన కవితల ద్వారా చైతన్య వంతు లను చేశారని, అయన స్ఫూర్తిని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, మున్సిపల్‌ కమీషనర్‌ సమ్మయ్య, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, పరిపాలన అధికారి బి గంగయ్య, పర్యవేక్షకులు శ్రీకాం త్‌, రవికాంత్‌, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more