వాయిదాల పర్వం

ABN , First Publish Date - 2022-12-30T01:21:54+05:30 IST

వివిధ గ్రామాల్లో ఖాళీగా ఉన్న పంచాయతీలకు ఉప ఎన్నికలు తరచూ వాయిదా పడుతూ వస్తున్నాయి. నోటిఫికేషన్‌ జారీ అవుతుందని అశావ హులు సిద్ధమవుతున్న క్రమంలోనే వాయిదాలు పడుతోంది. 2023 సంవత్సర్సంలోనైనా పంచాయతీ ఉప ఎన్నికలు జరుగుతాయని భావిస్తు న్నా ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలకు అధికార పార్టీ వెళితే ఎన్నికలు మరింత జాప్యం కానున్నాయి.

వాయిదాల పర్వం
గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం

- పంచాయతీ ఉప ఎన్నికలకు ఎదురు చూపులు

- జిల్లాలో 5 సర్పంచ్‌లు, 81 వార్డు స్థానాలు ఖాళీ

- సిరిసిల్లలో కౌన్సిలర్‌... కొండాపూర్‌ ఎంపీటీసీ స్థానాలు

(ఆంఽధ్రజ్యోతి సిరిసిల్ల)

వివిధ గ్రామాల్లో ఖాళీగా ఉన్న పంచాయతీలకు ఉప ఎన్నికలు తరచూ వాయిదా పడుతూ వస్తున్నాయి. నోటిఫికేషన్‌ జారీ అవుతుందని అశావ హులు సిద్ధమవుతున్న క్రమంలోనే వాయిదాలు పడుతోంది. 2023 సంవత్సర్సంలోనైనా పంచాయతీ ఉప ఎన్నికలు జరుగుతాయని భావిస్తు న్నా ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలకు అధికార పార్టీ వెళితే ఎన్నికలు మరింత జాప్యం కానున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా 5 సర్పంచ్‌లు, 81 వార్డులు, ఒక ఎంపీటీసీ స్థానం, సిరిసిల్ల మున్సిపాలిటీలో ఒక వార్డు కౌన్సిలర్‌ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఏడాది గడిస్తే అన్ని స్థానిక ఎన్నికలతో పాటే జరిగే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా వివిధ కారణాల వల్ల 44 గ్రామ పంచాయతీల పరిధిలో 87 స్థానిక సంస్థల ఖాళీల్లో 5 సర్పంచ్‌ స్థానాలు, 81 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. వీటి పరిధిలో 16,416 మంది ఓటర్లను ఇప్పటికే గుర్తించారు. ఇందులో పురుషులు 8,091 మంది, మహిళలు 8,325 మంది ఉన్నారు.

సర్పంచ్‌ స్థానాలు ఇవే...

జిల్లాలో 5 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇల్లంతకుంట మండలంలో గోల్లపల్లి, దాచారం, సోమారం పేట, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి, వీర్నపల్లి మండలం బావుసింగ్‌నాయక్‌ తండా సర్పంచ్‌ స్థానాలు ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటు ఉపసర్పంచ్‌ఖాళీల్లో బోయినపల్లి మండలం దేశాయిపల్లి, ఇల్లంతకుంట మండలం గుండపల్లి, గంభీరావుపేట మండలం దేశాయిపేట, కొత్తపల్లి, కోనరావుపేట మండ లంలో కనగర్తి, మర్తనపేట, వేములవాడ మండలంలో అరెపల్లి ఖాళీలు ఉన్నాయి. వీటి పరిఽధిలో ఓటర్ల లెక్కను కూడా తేల్చారు. జిల్లాలోని 5 సర్పంచ్‌ స్థానాలకు సంబంధించి 4,842 మంది ఓటర్లు ఉండగా పురుషులు 2,424 మంది, మహిళలు 2,418 మంది ఉన్నారు. ముస్తాబాద్‌ మండలం కొండాపూర్‌ ఎంపీటీసీ స్థానంలో 2222 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,075మంది, మహిళలు 1,147 మంది ఉన్నారు. జిల్లాలో 81 వార్డు సభ్యుల ఖాళీలు ఉండగా అందులో ఇల్లంతకుంట మండలంలో గొల్లపల్లి, దాచారం, సోమారంపేట, తంగళ్లపల్లిలో బద్దెనపల్లి, వీర్నపల్లిలో బావుసింగ్‌తండాలు ఉన్నాయి. ఇల్లంతకుంట మండలం గొల్లపల్లిలో గత గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఎన్నికలను పూర్తిగా బహిష్క రించడంతో సర్పంచ్‌తో పాటు 8 వార్డులు ఖాళీ ఏర్పడ్డాయి. వీటికి పూర్తిగా ఎన్నికలు నిర్వహించనున్నారు.

వార్డు స్థానాలు ఇవే

జిల్లాలో 50 గ్రామ పంచాయతీల పరిధిలో 81 వార్డు సభ్యుల ఖాళీలు ఏర్పడ్డాయి. వీటి పరిధిలో 10,918 మంది ఓటర్లను ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ గుర్తించింది. ఇందులో పురుషులు 5,391 మంది, మహిళలు 5,527 మంది ఉన్నారు. వార్డు సభ్యుల ఖాళీలు పరిశీలిస్తే బోయినపల్లి మండలంలో దేశాయిపల్లిలో 7వ వార్డు, స్థబంపల్లిలో 5వ వార్డు, కొదురుపాకలో 4వ వార్డు, మల్కపూర్‌లో 6వ వార్డు, రామన్నపేటలో 8వ వార్డు, చందుర్తి మండలంలో బండపల్లిలో 5వ వార్డు, జోగాపూర్‌లో 5వ వార్డు, కట్టలింగంపేటలో 8వ వార్డు, మల్యాలలో 11వ వార్డు, ఇల్లంతకుంట మండలం గూడెపల్లిలో 1వ వార్డు, గంభీరావుపేట మండలం దేశాయిపేట 5వ వార్డు, కోనరావుపేట మండలం బావుసాయిపేటలో 4వ వార్డు, ధర్మారంలో 1వ వార్డు, 7వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డు, కనగర్తిలో 3వ వార్డు, 10వ వార్డు, మల్కపేటలో 1వ వార్డు, 8వ వార్డు, మంగళ్లపల్లెలో 1వ వార్డు, 3వ వార్డు, 5వ వార్డు, 7వ వార్డు, మరిమడ్లలో 2వ వార్డు, 5వ వార్డు, 7వ వార్డు, 9వ వార్డు, మర్తనపేటలో 5వ వార్డు, 4వ వార్డు, నిమ్మపల్లిలో 2వ వార్డు, నిజామాబాద్‌లో 8వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డు, పల్లిమక్తలో 3వ వార్డు, 7వ వార్డు, 8వ వార్డు, సుద్దాలలో 2వ వార్డు, ముస్తాబాద్‌ మండలం అవునూర్‌లో 2వ వార్డు, గొపాల్‌పల్లి 5వ వార్డు, ముస్తాబాద్‌లో 12వ వార్డు, తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌లో 9 వవార్డు, బద్దెనపల్లిలో సర్పంచ్‌తో పాటు మొత్తం 10 వార్డులకు ఎన్నికలకు జరగనున్నాయి. గండిలచ్చపేటలో 1వ వార్డు, జిల్లెల్లలో 12వ వార్డు, లక్ష్మీపూర్‌లో 4వ వార్డు, మల్లాపూర్‌లో 1వ వార్డు, నేరేళ్లలో 3వ వార్డు, 9వ వార్డు, రాళ్లపేటలో 8వ వార్డు, 4వ వార్డు, తంగళ్లపల్లిలో 9వ వార్డు, వేణుగోపాల్‌పూర్‌లో 4వ వార్డు, కస్బెకట్కూర్‌ 1వ వార్డు, నేరేళ్ల 2వ వార్డు వీర్నపల్లి మండలంలో గర్జనపల్లిలో 6వ వార్డు, శాంతినగర్‌లో 1వ వార్డు, వేములవాడ మండలంలో అరెపల్లిలో 5వ వార్డు, వేములవాడ రూరల్‌ మండలంలో మల్లారంలో 2వ వార్డు, 6వ వార్డు, మర్రిపల్లిలో 8వ వార్డు, తుర్కాశినగర్‌లో 4వ వార్డు, వట్టెంల 8వ వార్డు, ఎల్లారెడ్డిపేట మండల నారాయణాపూర్‌లో 10వ వార్డులు ఖాళీ ఉన్నాయి. జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో గొల్లపల్లి, దాచారం, సోమారంపేట, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి, వీర్నపల్లి మండలం బావుసింగ్‌నాయక్‌ తండా సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు ఉపసర్పంచ్‌ స్థానాలు కూడా ఖాళీ ఏర్పడ్డాయి. ఉపసర్పంచ్‌లలో బోయినపల్లి మండ లం దేశాయిపల్లి, ఇల్లంతకుంట మండలం గుండెపల్లి, గంభీరావుపేట మండలం దేశాయిపేట, కొత్తపల్లి, కోనరావుపేట మండలం కనగర్తి, మర్తనపేట, వేములవాడ మండలం అరెపల్లి ఉపసర్పంచ్‌లు ఖాళీగా ఉన్నాయి. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో ఎస్సీ రిజర్వ్‌గా ఉన్నా 26వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన వోటారికారి లక్ష్మీరాజం కొవిడ్‌ కారణంగా మృతిచెందాడు. స్థానిక సంస్థల ఖాళీల భర్తీ జరగకపోవడంతో అయా వార్డుల్లో ప్రజల సమస్యలను పట్టించుకునే వారు లేరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2022-12-30T01:21:54+05:30 IST

Read more