దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజాకర్షక పథకాలు

ABN , First Publish Date - 2022-11-17T00:47:43+05:30 IST

దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రజాకర్షక పఽథకాలను అమలు చేస్తున్నారని, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొ నేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చెస్తోందని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజాకర్షక పథకాలు
చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు

ఇబ్రహీంపట్నం, నవంబర్‌ 16: దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రజాకర్షక పఽథకాలను అమలు చేస్తున్నారని, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొ నేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చెస్తోందని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. బుధవారం మండల పరిషత్‌ కా ర్యాలయ ఆవరణలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 56 మంది ల బ్ధిదారులకు రూ.56 లక్షల విలువ గల కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ చెక్కులను, 57 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ప్రజప్రతినిధులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అనే క సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నా రు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి బీజేపీ కుట్రలు పన్ను తోందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పేదలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటే వేలకు వేలు బిల్లులు చెల్లించాల్సి వచ్చేదని, టీఆర్‌ఎస్‌ పాలనలో ఆ భయం తొలగిపోయిందన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాజాల భీమేశ్వరి-జగన్‌రావు, జడ్పీటీసీ కముటం భారతి, వైస్‌ ఎంపీపీ నోముల లక్ష్మరెడ్డి, సర్పంచ్‌ నేమూరి లత-సత్యనారయణ, ఎంపీడీవో కట్కం ప్రభు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T00:47:43+05:30 IST

Read more