పెన్షన్‌ సెటిల్‌మెంట్‌ను వెంటనే చేయాలి

ABN , First Publish Date - 2022-11-25T00:00:54+05:30 IST

పెన్షన్‌ సెటిల్‌మెంటను వెంటనే చేయాలని ఏఐ టీయూసీ ప్రధానకార్యదర్శి సీతారామయ్య అన్నారు.

పెన్షన్‌ సెటిల్‌మెంట్‌ను వెంటనే చేయాలి

గోదావరిఖని, నవంబరు 24: పెన్షన్‌ సెటిల్‌మెంటను వెంటనే చేయాలని ఏఐ టీయూసీ ప్రధానకార్యదర్శి సీతారామయ్య అన్నారు. గురువారం గోదావరిఖని భాస్క ర్‌రావు భవన్‌లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో 2012కు పూ ర్వం ఏఐటీయూసీ హయాంలో రిటైర్డ్‌ కార్మికులకు సన్మానం చేసినరోజునే సీఎం పీఎఫ్‌, గ్రాట్యూటీ చెక్కులతో పాటు పెన్ష న్‌ లెటర్‌ను ఇచ్చేవారని, కానీ టీబీజీకేఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మి కులకు పర్మినెంట్‌ బెనిఫిట్స్‌ అందడం లేదన్నారు. లంచాలకు అలవాటుపడిన యూనియన్‌ నాయకులు పైరవీలు చేస్తే నే ప్రయోజనాలు పొందేవిధంగా పరిస్థి తులు నెలకొన్నాయని విమర్శించారు. ఆర్‌కేన్యూటెక్‌ గనిలో లంచం తీసుకుని అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్క డమే దీనికి నిదర్శనమని, కార్మికులకు ప్రతి సంవత్సరం సీఎంపీఎఫ్‌ చిట్టీలు ఇవ్వాలని, పెన్షన్‌ను త్వరగా సెటిల్‌మెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి లో పదవీవిరమణ పొందిన కార్మికుని మొదటి భార్య చనిపోతే మరల వివా హం చేసుకున్న వారిని పెన్షన్‌ రికార్డుల్లో రెండవ భార్య పేరును నామినిగా చేర్చి న్యాయం చేయాలని, ఇలా చాలా మంది కార్మికులు ఉన్నారన్నారు.60నాగాలు ఉన్న కార్మికులకు ప్రమోషన్లు వర్తించవని యా జమాన్యం అమానుషంగా సర్క్యూలర్‌ జారీ చేసినా గుర్తింపు సంఘం నోరు మె దపడం లేదని, ఆ సర్క్యూలర్‌ను యాజ మాన్యం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చ రించారు. ఈ సమావేశంలో రంగు శ్రీని వాస్‌, రాజ్‌కుమార్‌, చెప్యాల మహేందర్‌ రావు, తిరుపతి, బుర్ర భాస్కర్‌, చల్లా రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:00:54+05:30 IST

Read more