పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-04-24T17:05:07+05:30 IST

పెద్దకాల్వల శివారులోని రాజీవ్ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.

పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం

పెద్దపల్లి జిల్లా: పెద్దకాల్వల శివారులోని రాజీవ్ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం-కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Read more