-
-
Home » Telangana » Karimnagar » Passionate about sports-NGTS-Telangana
-
క్రీడలతో మానసికోల్లాసం
ABN , First Publish Date - 2022-09-08T07:13:14+05:30 IST
క్రీడలు మానసికోల్లాసం కలుగుతుందని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు.

- అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్
తిమ్మాపూర్, సెప్టెంబరు 7: క్రీడలు మానసికోల్లాసం కలుగుతుందని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. బుధవారం మండలంలోని రామకృష్ణకాలనీ మహాత్మా జ్యోతిబాపూలే బాలుర, మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఉమ్మడి జిల్లాల గురుకుల పాఠ శాలల విద్యార్ధులకు క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కనకయ్య, ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్, వ్యాయమ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.