-
-
Home » Telangana » Karimnagar » NTPC Director visited Ramagundam plant-MRGS-Telangana
-
రామగుండం ప్లాంట్‌ను సందర్శించిన ఎన్‌టీపీసీ డైరెక్టర్
ABN , First Publish Date - 2022-09-12T05:02:07+05:30 IST
ఎన్‌టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(పీఎం) త్రిపాఠి ఆదివారం రామగుండం ప్లాంట్‌ను సందర్శించారు.

జ్యోతినగర్, సెప్టెంబరు 11: ఎన్‌టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(పీఎం) త్రిపాఠి ఆదివారం రామగుండం ప్లాంట్‌ను సందర్శించారు. రెండు రోజుల రామగుండం పర్యటలో మొదటి రోజు తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. త్వరలో నిర్మాణం పూర్తి కానున్న టీఎస్ టీపీపీ తుదిదశ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఈడీ త్రిపాఠి అధికారులకు పలు విషయాలపై దిశా నిర్దేశం చేశారు. సోమవారం ఆయన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు, ఎన్‌టీపీసీ ప్రాజెక్టుల్లో పర్యటించనున్నారు. త్రిపాఠి వెంట రామగుండం సీజీఎం సునీల్‌కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.