18 ఆసుపత్రులకు నోటీసులు

ABN , First Publish Date - 2022-09-28T05:26:13+05:30 IST

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆసుపత్రుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం 91 ఆసుపత్రులను తనిఖీ చేశారు.

18 ఆసుపత్రులకు నోటీసులు
రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు

సుభాష్‌నగర్‌, సెప్టెంబరు 27: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో  ఆసుపత్రుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం 91 ఆసుపత్రులను తనిఖీ చేశారు. తెలంగాణ అలోపతిక్‌ క్లినికల్లీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం-2002 నిబంధనల ప్రకారం ఆసుపత్రులు, డయోగ్నోస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేశారా, అందుకు కావలిసిన అన్ని రకాల అనుమతులు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. మంగళవారం తనిఖీల్లో నిబంధనలు పాటించని 18 ఆసుత్రులకు నోటీసులు జారీ చేశామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా తెలిపారు. నోటీసులు అందుకున్నావారు మూడు రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే తగు చర్యలు తీసుకుంటామన్నారు.

Read more