-
-
Home » Telangana » Karimnagar » noise of the devotees in the presence of the king-NGTS-Telangana
-
రాజన్న సన్నిధిలో భక్తుల సందడి
ABN , First Publish Date - 2022-02-19T06:24:24+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారి దర్శించుకున్నారు.

- స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు
వేములవాడ, ఫిబ్రవరి 18 : వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారి దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. శుక్రవారం సందర్భంగా లఘుదర్శనం అమలు చేశారు. ఆలయ కళాభవన్లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, బాలాత్రిపురాసుందరీ దేవి ఆలయంలో కుంకుమపూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ఎల్.రమాదేవి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.
రాజన్న సేవలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.జీ.ప్రియదర్శిని శుక్రవారం వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఎల్.రమాదేవి, అర్చకులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు.
రాజన్న సేవలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్
తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ తన్నీరు రంగారావు వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. టీఎస్ ఈఆర్సీ సభ్యులు ఎం.డీ మోహనరాజు, బి.కృష్ణయ్య, కమిషన్ కార్యదర్శి ఉమాకాంత పండతో కలిసి శుక్రవారం ఉదయం స్వామివారి సన్నిధిలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు ఆశీర్వదించారు. ఆలయ ఏఈవో బి.శ్రీనివాస్ స్వామివారి ప్రసాదం అందజేశారు. సెస్ ఎం.డీ రామకృష్ణ ఆయన వెంట ఉన్నారు. టీఎస్ఈఆర్సీ చైర్మన్ తన్నీరు రంగారావును ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉపాధ్యాయుల చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు ఘనంగా సన్మానించారు.