దళితబంధు యూనిట్లు పరిశీలించిన నీతి అయోగ్‌ బృందం

ABN , First Publish Date - 2022-09-17T05:31:46+05:30 IST

హుజూరాబాద్‌ పట్టణంలో విశ్వనాథ్‌ బిష్ణయ్‌ నేతృత్వంలోని నీతి అయోగ్‌ బృందం శుక్రవారం దళితబంధు యూనిట్లను పరిశీలించారు.

దళితబంధు యూనిట్లు పరిశీలించిన నీతి అయోగ్‌ బృందం
హుజూరాబాద్‌లో దళితబంధు యూనిట్‌ను పరిశీలిస్తున్న నీతి అయోగ్‌ బృందం సభ్యులు


హుజూరాబాద్‌, సెప్టెంబరు 16: హుజూరాబాద్‌ పట్టణంలో విశ్వనాథ్‌ బిష్ణయ్‌ నేతృత్వంలోని నీతి అయోగ్‌ బృందం శుక్రవారం దళితబంధు యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పేపర్‌ప్లేట్స్‌ మేకింగ్‌, ఎంబ్రాయిడరీ మిషన్‌, నాన్‌ ఒవెన్‌ బ్యాగ్స్‌ తయారీ యూనిట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కమిటీ బృందం సభ్యులు మాట్లాడుతూ దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దళితబంధు పథకం ద్వారా అర్హులైన దళితులకు రూ. 10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేసిందన్నారు. పరిశ్రమల, వ్యాపారాల ద్వారా ఉపాధి కల్పించేందుకు, దళిత సమాజం వ్యాపారవర్గంగా అభివృద్ధి చెందడంలో ఈ పథకం ఉపయోగపడుతుం దన్నారు. దళితులకు ఆర్థిక చేయూతకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో నీతి అయోగ్‌ సభ్యులు కుమార్‌ జాయిన్‌, నిఖిత జాయిన్‌, యశస్విన్‌ సరస్వతి, ఇరామయీ, ఎస్సీ కార్పొరేషన్‌ జిల్లా ప్రత్యేకాధికారి సురేష్‌, జిల్లా నెహ్రూ యువ కేంద్రం కో-ఆర్డినేటర్‌ వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more