అశ్వ వాహనంపై స్వామివారల విహారం

ABN , First Publish Date - 2022-10-03T06:02:11+05:30 IST

వేములవాడ దివ్యక్షేత్రంలో పార్వతీ రాజరాజేశ్వరస్వామి, లక్ష్మీఅనంతపద్మనాభస్వామివారలు ఆదివారం రాత్రి అశ్వ వాహనంపై విహరించారు

అశ్వ వాహనంపై  స్వామివారల విహారం
అశ్వ వాహనం ఊరేగుతున్నస్వామివారలు

వేములవాడ, అక్టోబరు 2: వేములవాడ దివ్యక్షేత్రంలో పార్వతీ రాజరాజేశ్వరస్వామి, లక్ష్మీఅనంతపద్మనాభస్వామివారలు ఆదివారం రాత్రి అశ్వ వాహనంపై విహరించారు. శరన్నవరాత్ర్సోవాల్లో భాగంగా ఏడో రోజు ఉదయం, సాయంత్రం  స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.  రాత్రి  అశ్వ వాహనంపై  స్వామివారి ఉత్సవ విగ్రహాలను పట్టణ వీధుల మీదుగా ఊరేగించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఏనుగు మనోహర్‌రెడ్డి, ఆలయ ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ నాగుల మహేశ్‌, పరిశీలకుడు సంకేపల్లి పవన్‌కుమార్‌, ఎలక్ర్టికల్‌ ఏఈ డి.శేఖర్‌ పాల్గొన్నారు. 

Read more