ప్రశాంతగా నీట్‌

ABN , First Publish Date - 2022-07-18T06:17:24+05:30 IST

వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించిన నీట్‌ ఉమ్మడి జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు కో ఆర్డినేటర్‌ టి లలితకుమారి తెలిపారు.

ప్రశాంతగా నీట్‌
తిమ్మాపూర్‌లోని జ్యోతిష్మతి పరీక్ష కేంద్రంలో విద్యార్థుల క్యూలైన్‌

-3,671 మంది విద్యార్థుల హాజరు

తిమ్మాపూర్‌/హుజూరాబాద్‌/సుభాష్‌నగర్‌, జూలై 17: వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించిన నీట్‌ ఉమ్మడి జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు కో ఆర్డినేటర్‌ టి లలితకుమారి తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తిమ్మాపూర్‌ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, కరీంనగర్‌ వివేకానంద రెసిడెన్షియల్‌ పాఠశాల, వివేకానంద డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల,  హుజూరాబాద్‌లోని కిట్స్‌, జగిత్యాలలోని శ్రీ చైతన్య హైస్కూల్‌, కేజీఆర్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మద్యాహ్నం రెండు గంటల నుంచి 5.20 వరకు పరీక్ష జరిగింది. 3,775 మంది విద్యార్థులకు గాను 3,671మంది హాజరు కాగా 104 మంది గైర్హాజరయ్యారని డాక్టర్‌ టి లలితకుమారి తెలిపారు. వర్షంలో తడిసి రావడంతో కొందరు విద్యార్థుల బయోమెట్రిక్‌ నమోదు కొద్దిగా ఇబ్బందిగా మారింది. కొందరు విద్యార్థులు పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలు లేకుండానే పరీక్ష కేంద్రానికి రావడంతో పరీక్షా కేంద్రంలోనే వారికి ఫోటోలు తీసి ఇబ్బంది కలగాకుండా ఏర్పాటు చేశారు. ఆభరణాలు, మొబైల్‌తోపాటు ఏ ఇతర ఎలకా్ట్రనిక్‌ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. 

ఫ హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌ కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం నీట్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్‌ కె శంకర్‌ తెలిపారు. 936 మంది విద్యార్థులకు గాను 904 మంది హాజరయ్యారు. 

ఫ ఫిజిక్స్‌ బిట్స్‌ టఫ్‌గా ఇచ్చారు

- శ్రీధర్‌ విద్యార్థి

గతంలో పేపర్‌ కంటే ఈ సంవత్సరం పేపర్‌ ఈజీగా ఉంది. ఫిజిక్స్‌ బిట్స్‌ చాలా టఫ్‌గా వచ్చాయి. మిగితా అన్ని  ప్రశ్నలు ఈజీగా ఉన్నాయి. సమయం సరిపోలేదు.

ఫ సమయం సరిపోలేదు...

- నందిని, విద్యార్థిని

ప్రశ్నలు చాలా పెద్దవి అడిగారు. ముఖ్యంగా ఫిజిక్స్‌, బయోలజీకి సంబందించిన ప్రశ్నలకు జవాబు రాయడానికి సమయం సరిపోలేదు.  పరీక్ష బాగానే రాశాను. 

ఫ పేపర్‌ చాలా బాగా వచ్చింది

ఎం ఆనంద్‌, విద్యార్థి

పేపర్‌ ఈజీగా లేదు....అలా అని హార్డుగా కూడా లేదు. పరీక్ష బాగానే రాసాను. ఫిజిక్స్‌లో లెక్కలు ఎక్కువగా రాలేదు. థియరీకి సంబందించిన ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి పేపర్‌ చాలా బాగా వచ్చింది. పరీక్ష బాగానే రాసాను.

ఫ కొన్ని ప్రశ్నలు మినహా పేపర్‌ ఈజీగా వచ్చింది..

- పల్లవి, విద్యార్థిని

నీట్‌ చాలా బాగా రాసాను. పేపర్‌ ఈజీగా వచ్చింది. నేను ప్రిపేర్‌ అయినట్లుగానే పేపర్‌ వచ్చింది. కొన్ని ప్రశ్నలు మినహా మిగితా అన్ని ప్రశ్నలు ఈజీగానే ఉన్నాయి.

Updated Date - 2022-07-18T06:17:24+05:30 IST