ప్రతీ ఇంటిపైనా జాతీయ పతాకాన్ని ఎగరవేయాలి

ABN , First Publish Date - 2022-08-10T05:31:35+05:30 IST

National flag should be hoisted on every house

ప్రతీ ఇంటిపైనా జాతీయ పతాకాన్ని ఎగరవేయాలి
జాతీయ జెండాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే దాసరి

- ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి 

పెద్దపల్లి రూరల్‌, ఆగస్టు 9: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతీ ఇంటిపైనా జాతీయ జండాను ఎగురవేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లి మండలంలో ని చీకురాయి గ్రామంలో వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం జాతీయ జెండాలను  ఇంటింటా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, ఎంపీపీ స్రవంతి, జడ్పీటీసీ రామ్మూర్తి, సర్పంచ్‌, ఎంపీటీసీ రాజేశ్వరి పలువురు పాల్గోన్నారు. అలాగే అప్పన్నపేట గ్రామం లో సర్పంచ్‌ చీకటి స్వరూప-పోచాలు, పెద్దకల్వ లలో సర్పంచ్‌ కారెంగుల రమేష్‌, పెద్దబోంకూర్‌లో సర్పంచ్‌ కారుపాకల మానస-సంపత్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఇంటింటా జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. 


Read more