యైుటింక్లయిన్‌ కాలనీలో పర్యటించిన మున్సిపల్‌ కమిషనర్‌

ABN , First Publish Date - 2022-08-01T06:02:21+05:30 IST

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 15వ డివిజన్‌లో ఆదివారం కమిషనర్‌ సుమన్‌రావు పర్యటించారు.

యైుటింక్లయిన్‌ కాలనీలో పర్యటించిన మున్సిపల్‌ కమిషనర్‌
కాలనీవాసులతో మాట్లాడుతున్న కమిషనర్‌ సుమన్‌రావు

యైుటింక్లయిన్‌కాలనీ, జూలై 31: రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 15వ డివిజన్‌లో ఆదివారం కమిషనర్‌ సుమన్‌రావు పర్యటించారు. స్వచ్ఛ శుక్రవారం లో భాగంగా డివిజన్‌లో పరిశీలన జరిపి ప్రజలతో మాట్లాడారు. నిల్వ నీటిని తొల గించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నా రు. సీజనల్‌ వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో కార్పొరేటర్‌ శంకర్‌నాయక్‌,నాయకులు పాశం శ్రీను, మొగిలి, గొడిశల రవి, సూపర్‌వైజర్‌ సోమేష్‌, ఆర్‌పీలు ఉషారాణి, రమాదేవి, భూలక్ష్మి పాల్గొన్నారు.

Read more