చైర్మన్‌ కార్యాలయం ఎదుట ముదిరాజ్‌ల ధర్నా

ABN , First Publish Date - 2022-12-12T00:53:49+05:30 IST

ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ కార్యాల యం ముందు ఆదివారం ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

చైర్మన్‌ కార్యాలయం ఎదుట ముదిరాజ్‌ల ధర్నా

ఓదెల, డిసెంబరు 11 : ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ కార్యాల యం ముందు ఆదివారం ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ముదిరాజ్‌ సంఘం నాయకులు పందేన నర్సింగం, పిట్టల నర్సింగం తో పాటు పలువురు మాటాడారు. ప్రభుత్వ అనుమతితో కుంట కట్టలను తీసివేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అలాగే ముదిరాజ్‌ కులస్థులకు జీవనోపాధి చూపించి చెరువు కట్టలను తొలగించాలని తెలిపారు. అక్రమంగా దేవాలయ పాలక మండలి చెరువు కట్టను తొలగించడం వల్ల అందులో నుంచి వేల సంఖ్యలో చేప పిల్లలు బయటికి వెళ్లాయని, వాటి నష్టపరిహరం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఒక పక్క ప్రభుత్వం ముదిరాజ్‌ కులస్థులకు చేయూతనిస్తూ చేప పిల్లలను పంపిణీ చేస్తుండగా మరోపక్క దేవాలయ చైర్మన్‌ అక్రమంగా మల్లన్న కుంటను తొలగించే ప్రయత్నం చేశాడన్నారు. చైర్మన్‌తో పాటు సభ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి పేరుతో కుంట కట్టలను ధ్వంసం చేయడం న్యాయం కాదన్నారు. త్వరలోనే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం ఈవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ సిబ్బందికి ముదిరాజ్‌ సంఘం సభ్యులు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో తూడి రాజయ్య, మంద కుమారస్వామి, మంద కొమురయ్య, పెండెం లక్ష్మన్‌, పెండెం రాములు, పిట్ట ల రవికుమార్‌, పిట్టల రాంచంద్రం, తూడి సమ్మయ్య, స్వామి, కృష్ణమోహన్‌, ధనుం జయ్‌, పిట్టల రమాకాంత్‌, పసెట్ల సతీష్‌, దాసరి కృష్ణస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:53:49+05:30 IST

Read more