నిర్వాసితులకు న్యాయం చేయకుంటే ఉద్యమం

ABN , First Publish Date - 2022-08-22T04:59:42+05:30 IST

మధ్య మానేరు జలాశయంలో ముంపుకు గురైన నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమం తప్పదని ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు కూస రవీందర్‌ హెచ్చరించారు.

నిర్వాసితులకు న్యాయం చేయకుంటే ఉద్యమం
సమావేశంలో పాల్గొన్న ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకులు

వేములవాడ టౌన్‌, ఆగస్టు 21: మధ్య మానేరు జలాశయంలో ముంపుకు గురైన నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరాకపోతే  ఉద్యమం తప్పదని ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు కూస రవీందర్‌ హెచ్చరించారు. వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపెల్లిలో ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ   నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే తెగించి కోట్లాడే పరిస్థితి వస్తుందన్నారు. 29వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యలయాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేయాలన్నారు.  వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపల్లి నంది కమాన్‌ వద్దకు చేరుకోవాలని, మహాధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పిల్లి కనుకయ్య, కదిరె రాజ్‌కుమార్‌, బాస రాజశేఖర్‌, గాలిపెల్లి స్వామి, శేఖర్‌, పర్శరాం, ప్రభాకర్‌రెడ్డి, ఎర్రం ఆగయ్య, పండుగ పర్శరాములు, మల్లేశం, కత్తి కనకయ్య, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-08-22T04:59:42+05:30 IST