వానాకాలం పంట ప్రణాళిక ఖరారు

ABN , First Publish Date - 2022-05-24T06:03:35+05:30 IST

జిల్లాలో వానాకాలం పంట ప్లానింగ్‌ ఖరారు అయింది.

వానాకాలం పంట ప్రణాళిక ఖరారు

- జిల్లాలో సాధారణానికి మించి సాగుకు అంచనా

- 4.42 లక్షల ఎకరాల్లో సాగవనున్న వివిధ పంటలు

- విత్తనాలు, ఎరువులు, కాంప్లెక్స్‌ ప్లానింగ్‌ సిద్ధం

జగిత్యాల, మే 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వానాకాలం పంట ప్లానింగ్‌ ఖరారు అయింది. రానున్న ఖరీఫ్‌లో రైతుల ఇబ్బందులు తొలగించడానికి వ్యవసాయశాఖ ముందస్తుగా సాగు ప్రణాళిక రూపొందించింది. వ్యవసా య క్లస్టర్ల వారీగా ఎన్ని ఎకరాల్లో భూమి సాగవుతుందని అంచనా వేసి ఈ మేరకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచనున్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు రూపొందించిన వానాకాలం పంట ప్రణాళి కపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం...

సాధారణ విస్తీర్ణంకంటే ఎక్కువగా సాగు....

జిల్లా వ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణం కంటే అధికంగా వానాకాలం లో పంటల సాగు అవుతుందన్న అంచనాను అధికారులు వేశారు. జిల్లా లో పంటలు సాధారణ సాగు విస్తీర్ణం 3,35,976 ఎకరాలు ఈ సీజన్‌లో 4,42,980 ఎకరాలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఇది సాధారణం క న్నా 1,07,004 ఎకరాలు అధికం. మండలాల్లోని క్లస్టర్ల వారీగా సాగు విస్తీ ర్ణం అంచనాలను వ్యవసాయ అధికారులు రూపొందించారు. ఇందులో ప్ర ధానంగా వరి 2,80,751 ఎకరాలు, మొక్కజొన్న 55,037 ఎకరాలు, కందు లు 12,595, పెసర్లు 468, మినుములు 11, ఇతర పప్పులు 488, సోయా చిక్కుడు 1,831, పత్తి 31,463, చెరుకు 898 ఎకరాలు, పసుపు 21,686, ఇతర పంటలు 37,753 ఎకరాల్లో సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. రైతు వేధికల ద్వారా సంబంధిత పంటలపై సిఫార్సు చేసిన సా గు విధానంపై కరపత్రాలు, పోస్టర్లు, బుక్‌ లెట్‌లను అందించడం వంటివి చేయడానికి అధికారులు నిర్ణయించారు. 2022లో పత్తి, కంది పంటల సాగును విస్తరించాలని నిర్ణయించారు. 

అందుబాటులో విత్తనాలు....

జూన్‌ 1 నుంచి వానాకాలం సీజన్‌ మొదలుకాగానే అన్నదాతలకు అవ సరమైన ఎరువులు, విత్తనాలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వరికి సంబంధించి వివిధ రకాల విత్తనాలు 70,188 క్వింటాళ్లు అవసరమని అం చనా వేశారు. మొక్కజొన్న 4,403 క్వింటాళ్లు, కందుల 1,008, పెసర్లు 38, సోయాబిన్‌ 458 క్వింటాళ్లు అవసరమవుతాయని, మిగిలిన అన్ని రకాల పంటలకు సంబంధించి 500 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికా రులు అంచనా వేశారు. 

ఎరువుల సరఫరాకు ప్రతిపాదనలు...

జిల్లాలో ప్రతిపాదించిన పంటల విస్తీర్ణం ఆధారంగా ఎరువుల ప్రణాళిక లు తయారు చేశారు. జిల్లాకు అవసరమైన ఎరువుల సరఫరాకు ప్రభు త్వానికి ప్రతిపాదనలను అధికారులు సమర్పించారు. రానున్న వానాకాలం సీజన్‌లో జిల్లాలో మొత్తం కాంప్లెక్స్‌ 47,680 మెట్రిక్‌ టన్నులు అవసరమ వుతాయన్న అంచనా ఉంది. యూరియా 37,628, డీఏపీ 12,297, ఎస్‌ ఎస్‌పి 4,763, ఎంఓపీ 10,871 మెట్రిక్‌ టన్నులుఅవసరమవుతాయని అం చనా వేశారు. ఇందులో జూన్‌ మాసంలో కాంప్లెక్స్‌ 9,536, జూలైలో 9,536, ఆగస్టు 19,072, సెప్టెంబరులో 3,536 మెట్రిక్‌ టన్నులు అవసరమ ని అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

కార్యాచరణ ప్రణాళిక...

జిల్లాలో 399 విత్తన విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా విత్తనాన్ని రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. నకిలీ పత్తి, ఇతర వి త్తన విక్రయాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో భాగంగా పోలీ సులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి బృందాలను ఏర్పాటు చేశా రు. మే 3వ వారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని విత్తన విక్రయ కేంద్రా ల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనం, ఎరువుల, పరుగు మందులు అందించడానికి అధికారులు ఇచ్చిన లక్ష్యం ప్రకారం ప్రతీ ఎరువు, విత్తన దుకాణాలను తనిఖీ చేసి నమునాలను సేకరించి పరీక్షా కేంద్రానికి పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రదర్శన క్షేత్రాల ఏర్పాటు...

జిల్లాలో ప్రతీ క్లస్టర్‌ పరిధిలో ఒక వరి ప్రదర్శన కేంద్రను ఏర్పాటు చేస్తున్నారు. 25 మంది రైతులతో లేదా 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రదర్శన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధం గా పాస్పరస్‌ సోలబులైజింగ్‌ బాక్టరియా ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. పచ్చిరొట్ట ఎరువును ప్రోత్సహించనున్నారు. కాగా జిల్లాలో రైతులను ప్రోత్సహించేందుకు 65 శాతం సబ్సీడీపై 18,166 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు, 4,500 క్వింటాళ్ల జనుము విత్తనాన్ని సిద్దంగా ఉంచారు.

అంచనాలు రూపొందించాం

- సురేశ్‌ కుమార్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జగిత్యాల

జిల్లాలో వానాకాలం పంట సాగు అంచనాలను రూపొందించాము. అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు కసరత్తులు చేస్తున్నాము. జిల్లాలో ప్రధానంగా వరి, ఇతర పంటలను సాగు చేస్తారు. ఇందుకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సిద్ధం చేస్తున్నాము. రైతులకు పంట సాగుపై అవగాహణ కల్పించడానికి నిర్ణయించాము.

Read more