-
-
Home » Telangana » Karimnagar » Monitoring by command and control center-NGTS-Telangana
-
కమాండ్‌కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ
ABN , First Publish Date - 2022-09-10T06:58:42+05:30 IST
కరీంనగర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన గణేష్ నిమజ్జన వేడుకలను పోలీసులు అడుగడుగునా పర్యవేక్షించారు.

కరీంనగర్ క్రైం : కరీంనగర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన గణేష్ నిమజ్జన వేడుకలను పోలీసులు అడుగడుగునా పర్యవేక్షించారు. కమిషనరేట్ కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి క్షేత్రస్థాయిలో గణేష్ మండపాలు, నిమజ్జన ర్యాలీలను సీసీ కెమెరాలతో పోలీసు అధికారులు పర్యవేక్షించారు. నగరంలోని వివిధ మార్గాల నుంచి టవర్‌సర్కిల్‌కు వచ్చే వినాయక విగ్రహాల ర్యాలీ, అక్కడి నుంచి కమాన్, అలుగునూర్ మార్గాలలో నిమజ్జనం కోసం వెళుతున్న సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఇదివరకు ఉన్న సీసీ కెమెరాలకు తోడు మరికొన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేశారు.