అక్రమ వసూళ్లకు మంత్రి బాధ్యత వహించాలి

ABN , First Publish Date - 2022-09-08T06:08:28+05:30 IST

రామగుండం ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ కంపెనిలో ఉద్యోగాలను ఇప్పిస్తామని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని దీనికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి అన్నారు.

అక్రమ వసూళ్లకు మంత్రి బాధ్యత వహించాలి
మాట్లాడుతన్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

- ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి

మల్యాల, సెప్టెంబరు 7: రామగుండం ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ కంపెనిలో ఉద్యోగాలను ఇప్పిస్తామని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని దీనికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ బాధితులకు అండగా వెళ్తున్న  డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి మల్యాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిఽధి, చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం తో కలసి నాయకులను పోలీస్‌స్టేషన్‌లో పరామర్శిం చారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఔట్‌సోర్సింగ్‌ నియామాకాలు 300 వరకు అవసరముంటే దాదాపు 800మంది నిరుద్యోగు లు, పేదల వద్ద ఒక్కొక్కరి వద్ద ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల మేర అక్కడి ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు, టీఆర్‌ఎస్‌ నాయకులు అక్రమంగా వసూ లు చేశారని ఆరోపించారు. నిరుద్యోగుల వద్ద అక్రమం గా వసూలు చేసిన సొమ్ములను ఇప్పించేందుకు వివిధ రాజకీయ పార్టీలు రెండు నెలలుగా నిరసనలు, ధర్నాలు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. పోలీసు యంత్రాంగం నిర్లప్తత వల్లె కార్మికులు బలవన్మరణా లకు పాల్పడుతున్నారని హరీశ్‌ అనే యువకుడి మృతి, శేఖర్‌ అనే మరో కార్మికుడు ఆత్మహత్మయత్నానికి పోలీసులే కారణమన్నారు. పైగా శేఖర్‌ కుటుంబ సభ్యులను పోలీసులు అక్రమంగా నిర్భందించడం రాష్ట్రంలో నియంతృత్వ పాలనకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. వారం రోజులక్రితం సీఎం రాక సందర్భంగా ఎమ్మెల్యే చందర్‌ ప్రజా దర్బార్‌ నిర్వహించి బాధితులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చి తరువాత చేతులెత్తేశా రని విమర్శించారు. అక్రమ వసూళ్లకు పాల్పడిన ఎమ్మెల్యే అనుచరులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఇతర బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాం డ్‌ చేశారు.  కార్మికులకు న్యాయం జరిగే వరకు బాధితుల పక్షాన అండగా ఉంటామని భరోసా ఇచ్చా రు. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేను, టీఆర్‌ఎస్‌ నాయకులను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పరోక్షంగా కాపాడాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆదిరెడ్డి, గాజుల అజయ్‌, ఇమామ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-09-08T06:08:28+05:30 IST