మెట్‌పల్లిని సమష్టిగా అభివృద్ధి చేయాలి

ABN , First Publish Date - 2022-11-25T00:18:35+05:30 IST

కౌన్సిలర్లు, అధికారులు సమష్టిగా ఉంటూ మెట్‌పల్లిని అన్ని హంగులతో అభివృద్ధి పరచాలని, పట్టణ అభివృద్ధికి త న వంతు సహకారాలు ఉంటాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. గురువారం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రాణవేని సుజాత-సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మెట్‌పల్లిని సమష్టిగా అభివృద్ధి చేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు

మెట్‌పల్లి, నవంబరు 24 : కౌన్సిలర్లు, అధికారులు సమష్టిగా ఉంటూ మెట్‌పల్లిని అన్ని హంగులతో అభివృద్ధి పరచాలని, పట్టణ అభివృద్ధికి త న వంతు సహకారాలు ఉంటాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. గురువారం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రాణవేని సుజాత-సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్పిర్లు పట్టణంలోని డ్రైయినేజీ, విద్యుత్‌ స్తంభాలు, దీపాలు, రోడ్డు వెడల్పులు, సీసీ రోడ్ల మంజూరు, పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేయడం. శ్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణం, బకాయిలో ఉన్న నల్లా బిల్లులు, వార్డులలో స్వైర విహారం చేస్తున్న పందులు, కుక్కలు, కోతుల అరికట్టుట, టౌన్‌ ప్లానింగ్‌ విభాగం నందు రెగ్యులర్‌ ఆఫీసర్‌ల నియమించాలని వంటి సమస్యలను సభలో ఎమ్మెల్యేకు తెలిపారు. సమావేశంలో చైర్‌పర్సన్‌ ప్రవేశ పెట్టిన 14 అంశాలను వైస్‌ చైర్మన్‌తో పాటు కౌన్సిర్లు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో కౌన్సిర్లు తెలిపిన సమస్యలను ఆయా శాఖల అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిర్లు, కోఆప్షన్‌ సుభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:18:35+05:30 IST

Read more