విద్యాప్రమాణాల మెరుగుదలకు చర్యలు

ABN , First Publish Date - 2022-12-30T23:38:35+05:30 IST

జిల్లాలో తొలిమెట్టు కింద విద్యార్థుల ప్రాథమిక విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.సంగీత సత్యనారాయణ అన్నారు.

విద్యాప్రమాణాల మెరుగుదలకు చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి కల్చరల్‌ , డిసెంబరు 30 : జిల్లాలో తొలిమెట్టు కింద విద్యార్థుల ప్రాథమిక విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.సంగీత సత్యనారాయణ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టర్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి తొలిమెట్టు, పదోతరగతి పరీక్షలు, మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపడుతున్న పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కార్యక్రమం విజయవంతానికి జిల్లాలో 36 కాంప్లెక్స్‌లలో 14 నోడల్‌ అధికారులను ,56 రిసోర్స్‌ పర్సన్స్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. స్థానిక ఉపాధ్యాయులకు కూడ శిక్షణ అందించామని అన్నారు. తొలిమెట్టు కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందిగా అమలు చేయాలని , దాని ద్వారా వస్తున్న ఫలితాల వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ సూచించారు. మన ఊరు మన బడి కింద పూర్తి చేసి పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు నమోదు చేసి బిల్లులు క్లయిం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో డీఈవో మాఽధవి, ఈడీఎం కవిత, ఎంఈఓలు , నోడల్‌ అధికారులు, వివిధ పాఠఽశాలల ప్రధానోపాధ్యాయులు, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T23:38:37+05:30 IST