మంత్రాలు, గుప్త నిధుల పేరిట మోసాలు

ABN , First Publish Date - 2022-11-28T00:31:09+05:30 IST

మంత్రాలు, గుప్త నిధులు, చేతబడుల పేరిట ప్రజలను మోసం చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను గోదావరిఖని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మంత్రాలు, గుప్త నిధుల పేరిట మోసాలు

కోల్‌సిటీ, నవంబరు 27: మంత్రాలు, గుప్త నిధులు, చేతబడుల పేరిట ప్రజలను మోసం చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను గోదావరిఖని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పాల లక్ష్మణ్‌, లీలమ్‌ పాండు, గంగారపు వినయ్‌ కుమార్‌, వాసం రాజేష్‌లను అరెస్ట్‌ చేసి నట్టు ఏసీపీ గిరిప్రసాద్‌ తెలిపారు. నిందితులు రామగిరి మండలం నవాబ్‌పేట్‌కు చెందిన తిరుపతి వద్ద రూ.23 లక్షలు, గోదావరిఖనికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నీలారపు మహేందర్‌ వద్ద 5లక్షలు పూజల పేరిట మోసానికి పాల్పడినట్టు గోదావరిఖని ఏసీపీ గిరిప్ర సాద్‌ తెలిపారు. ఆదివారం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన విలే కరుల సమావేశంలో ఏసీపీ అరెస్ట్‌ వివరాలు, నిందితులు మోసాల కు పాల్పడుతున్న తీరును వెల్లడించారు. కొత్తగూడెంకు చెందిన అప్పాల లక్ష్మణ్‌ గతంలో కనికట్టు విద్య, పూజలు నేర్చుకుని ప్రజల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతూ డబ్బులు సంపాదించేవాడు. కొంతకాలంగా స్థానిక తిలక్‌నగర్‌లోని పిన్ని ఇంట్లో ఉంటున్నాడు. పిన్ని కొడుకైన పాండు రాజుతో పాటు వినయ్‌, రాజేష్‌లతో ముఠా ఏర్పాటు చేసు కున్నాడు. అనారోగ్యం బారిన పడినవారు, వ్యాపారాల్లో నష్టపోయిన వారిని గుర్తించి పాండు రాజు, వినయ్‌, రాజేష్‌లు లక్ష్మణ్‌ గురువు అని, పూజల ద్వారా నయం చేస్తాడని నమ్మ బలికేవారు. ఈక్రమం లో నవాబ్‌పేట్‌ కు చెందిన తిరుపతి అనారోగ్యం బారినపడడంతో తెలిసిన వారి ద్వారా నిందితులను కలిశాడు. పూజలు చేసినట్టు నటించి తిరుపతి ఇంట్లో కోట్లు విలువ చేసే గుప్త నిధులు ఉన్నా యని, ఎవరో చేతబడి చేశారని నమ్మించారు. తిరుపతి ఇంట్లో పూజ ల పేరిట వారికి తెలియకుండా రెండు ఇత్తడి దేవతల విగ్రహాలను పాతి పెట్టి, కొద్దిరోజుల తర్వాత వారి ముందు వెలికితీశారు. పలు మార్లు పూజలు చేస్తున్నట్టు నమ్మిస్తూ 23 లక్షలు తిరుపతి నుంచి నిందితులు వసూలు చేశారు. ఈనెల 22న గోదావరినదిలో రెండు విగ్రహాలకు పూజలు చేసి స్టీల్‌ డబ్బాలో భద్రపరిచినట్టు నమ్మించా రు. ఆరు నెలల వరకు డబ్బా తెరవవద్దని చెప్పడంతో అనుమానం వచ్చిన తిరుపతి ఇంటికి వచ్చాక స్టీల్‌ డబ్బా చూడగా ఒకే విగ్రహం ఉండడంతో మోసపోయానని గ్రహించాడు. నిందితులను నిలదీశా డు. తిరుపతి కుటుంబ సభ్యులను జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం లో సెటిల్‌ చేసుకుందామని రప్పించిన నిందితులు వారిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడు తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మణ్‌తో పాటు ముగ్గురు అతడి అనుచరులపై కేసు నమోదు చేశారు. ఆది వారం పారిపోయేందుకు ప్రయత్నించిన ముఠాను లక్ష్మణ్‌ ఇంటివద్ద అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదు, రెండు ఇత్తడి దేవతల విగ్రహాలు, పూజా సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ పేర్కొన్నారు. కాగా గతంలో గోదావరిఖని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నీలారపు మహేందర్‌ ఇదేతరహాలో పూజల పేరిట 5లక్షలు వరకు మోసం చేసినట్టు ఏసీపీ గిరిప్రసాద్‌ తెలిపారు. మూఢ నమ్మకాలను విడనాడాలని, పూజలు, చేతబడులు, గుప్త నిధుల పేరిట జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిందితులను అరెస్ట్‌ చేయడంలో చాకచక్యంగా వ్యవ హరించిన ఇన్‌స్పెక్టర్లు రమేష్‌బాబు, ప్రసాదరావు, ఎస్సై రమేష్‌లను ఏసీపీ అభినందించారు.

Updated Date - 2022-11-28T00:31:12+05:30 IST