ఈజీఎస్‌లో అవకతవకలు..

ABN , First Publish Date - 2022-03-16T06:03:42+05:30 IST

అడుగుడగునా నిభందనలు ఉల్లంఘించారు... పలు గ్రామాలలో చేపట్టిన పనులకు, అధికారుల రికార్డులకు పొంతన లేదు.

ఈజీఎస్‌లో అవకతవకలు..
ఈజీఎస్‌ పనుల వివరాలు అడిగి తెలుసుకుంటున్న పీడీ శ్రీధర్‌

- సంతకాలు లేకున్నా మస్టర్లు, చెల్లింపులు

- ప్రజా వేదికలో వెలుగులోకి..

సుల్తానాబాద్‌, మార్చి 15: అడుగుడగునా నిభందనలు ఉల్లంఘించారు... పలు గ్రామాలలో చేపట్టిన పనులకు, అధికారుల రికార్డులకు పొంతన లేదు. కూలీలు రాకున్నా మస్టర్లు పడిన వైనం... పైగా కూలీలు హాజరు అయినట్లు కార్యదర్శుల సంతకాలు.. పనులు చేయకున్నా చేసినట్టు నమోదు... ఇలా అనేక అవకతవకలు ఉపాధిహామీ పథ కం ప్రజా వేదికలో వెలుగుచూశాయి. సుల్తానాబాద్‌ మం డలంలో 2019-2021 సంవత్సరాలకు సంబంధించిన ఉపా ధిహామీ పనుల గురించి గత కొన్ని రోజులుగా అన్ని గ్రామాలలో 42 మంది వీఆర్పీలు, 12 మంది బీఆర్పీల చే క్షేత్ర స్థాయిలో పనుల పరిశీలన దానికి సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ, పని తీరు గురించి పరిశీలించి ఆడిటింగ్‌ చేసి నివేదికలను రూపొందించారు. మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో మంగళవారం ప్రజా వేదికను నిర్వహించారు. అన్ని గ్రామాలకు చెందిన పంచా యతీ కార్యదర్శులు పలువురు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు అధికా రులు పాల్గొన్నారు. ఈ ప్రజా వేదికలో ఆడిటింగ్‌ చేసిన ఆర్పీలు బీఅర్పీ లు తమ నివేదికలను ఒక్కో పని వారిగా చదివి వినిపించగా, ఇందులో పాల్గొన్న జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్‌ వాటిని పరిశీలించారు. అవసరమైన వివరాలను నమోదు చేసుకున్నారు. చాలా గ్రామాలలో పనులు సక్రమంగా జరుగలేదని, నిధుల చెల్పింపు కూడా అభ్యంతరక మైన పద్ధతిలో చేశారని, గ్రామాలలో నాటిన చెట్ల సంరక్షణలో వైఫల్యం ఉందని వేలాది చెట్లు చనిపోయినట్టు నివేదికలను సభలో చదివి విని పించారు. పలువురు పంచాయతీ కార్యదర్శుల, ఈజీఎస్‌ టెక్నికల్‌ అధికా రుల నుంచి పీడీ వివరణలు కోరారు. చర్యలకు సిఫారసు చేస్తామన్నారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఖర్చుపై, కొంత దుర్వినియోగం జరిగిన నిధుల గురించి బాధ్యుల నుంచి రికవరీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎంపీపీ బాలాజీరావు మాట్లాడుతూ నిబంధనలకు లోబడి పనులు చేయాలని, అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శశికళ, ఏపీఓ లావణ్య తదిత రులు పాల్గొన్నారు.

రూ. 4 లక్షల రికవరీకి ఆదేశాలు

సుల్తానాబాద్‌ మండలంలో 2019 నవంబర్‌ 1 నుంచి 2021 డిసెంబర్‌ 31 వరకు నిర్వహించిన ఈజీఎస్‌ పనుల గురించి ఆడిటింగ్‌ జరిపారు. ఈ కాలంలో 13 కోట్ల రూపాయల పనులు చేపట్టారు. మండలంలోని 27 గ్రామాలతో పాటు సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలోని సుగ్లాంపల్లి గ్రామం తో సహా నాలుగు లక్షల నాలుగు వేల 954 రూపాయలను రికవరీ చేయాలని ఆదేశించారు. 

Read more