‘మన ఊరు-మన బడి’ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2022-02-19T05:58:03+05:30 IST

మన ఊరు-మన బడి కార్యక్రమానికి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కలెక్టర్లను సూచించారు.

‘మన ఊరు-మన బడి’ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
జూమ్‌మీటింగ్‌లో పాల్గొన్న కలెక్టర్‌

- మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లిటౌన్‌, ఫిబ్రవరి 18: మన ఊరు-మన బడి కార్యక్రమానికి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కలెక్టర్లను సూచించారు. శుక్రవా రం జూమ్‌మీటింగ్‌లో కలెక్టర్లతో మాట్లాడారు. ప్రజల భాగస్వమ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మొదటి విడతలో 191పాఠశాలల్లో మెరుగై న వసతులు చేపట్టనున్నట్లు తెలిపారు. పది రోజుల్లో ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై దృష్టి సారించిందన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మైరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఇందుకు 600 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో 12అంశాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రహారి గోడ, టాయిలెట్లు, డిజిటల్‌విద్య, తాగునీటి సౌకర్యం, డైనింగ్‌ హాల్‌, అదనపు గదుల నిర్మాణం, కిచెన్‌, డైనింగ్‌ ఆధునికీకరణ, విద్యుద్ధీకరణకు నిధులు కేయించినట్లు తెలి పారు. 30లక్షల రూపాయల నుంచి రూ.2కోట్ల వరకు నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు. విద్యాశాఖ అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు పర్యవే క్షించాలని సూచించారు. బడుల అభివృద్ధి కోసం దాతలను ప్రొత్సహించాలన్నారు. ఇప్పటికే 21పాఠశాలల్లో ఏర్పాటుచేసిన విజ్ఞాన కేంద్రాలు మంచి ఫలితాలు ఇస్తున్నా యన్నారు. జిల్లాలో 191పాఠశాలలో క్షేత్రస్థాయిలో ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తదితరులున్నారు.

Read more