స్వాతంత్ర్యాన్ని అందించిన మహనీయుడు మహాత్మాగాంధీ

ABN , First Publish Date - 2022-10-03T05:53:55+05:30 IST

సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మా ర్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా. స్వాతంత్ర్యాన్ని అందించిన మహనీయుడు మహాత్మాగాంధీ అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

స్వాతంత్ర్యాన్ని అందించిన మహనీయుడు మహాత్మాగాంధీ
నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 2 : సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మా ర్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా. స్వాతంత్ర్యాన్ని అందించిన మహనీయుడు మహాత్మాగాంధీ అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేం ద్రంలోని గాంధీనగర్‌లో ఉన్న గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌తో కలిసి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పూల మాలలు వేసి 153వ, గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు గిరి నాగభూషణం, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్‌, మహిళా కాం గ్రెస్‌ అధ్యక్షురాలు విజయ లక్ష్మి, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మన్సూర్‌, నా యకులు ఉన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, అరు ణశ్రీలు గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి మాట్లా డారు. ఎస్పీ సింధు శర్మ, జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతల ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. జగిత్యాల బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ జయంతి నిర్వహించారు. 

Updated Date - 2022-10-03T05:53:55+05:30 IST