గ్రామపంచాయతీలకు మహర్దశ

ABN , First Publish Date - 2022-10-02T05:11:55+05:30 IST

రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు.

గ్రామపంచాయతీలకు మహర్దశ
పింఛన్‌ ప్రొసీడింగ్‌ పత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌, అక్టోబరు 1: రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు.  మండలంలోని అంతర్గాం ఒడ్డెరకాలనిలో ఆర్‌జిఎస్‌ఏ నిధులు రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయితీ భవనాన్ని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంతతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం నూతనంగా మంజూరైన పింఛన్‌కార్డులు, బతుకమ్మచీరలు, కల్యాణలక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకప్పుడు ఒడ్డెర కాలనీ వాసులు నీటి సమస్యను ఎదుర్కొన్నారని, నేడు మిషన్‌ భగీరధ లాంటి గొప్ప కార్యక్రమం ద్వారా  తాగునీటి సమస్య తీరిందని తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్‌ వసంత మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చిన్నచిన్న తాండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు.  కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీపీ రాజేంద్రప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ రాధారవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ నవీన్‌, ఎంపీడీవో రాజేశ్వరి, ఎంపీవో రవిబాబు, సర్పంచ్‌ నారాయణ, డీఈ మిలింద్‌, ఏఈ రాజమల్లయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read more