చిరుతపులి సంచారం

ABN , First Publish Date - 2022-10-18T05:51:06+05:30 IST

మండలంలోని సూరారం గ్రామ శివారులో చి రుత పులి కలకలం రేపుతోంది.

చిరుతపులి సంచారం
చిరుత అడుగులను పరిశీలిస్తున్న ఫారెస్ట్‌ అధికారులు

ఫ భయాందోళనలో ప్రజలు

ఫ సంఘటన స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారులు

వెల్గటూర్‌, అక్టోబరు 17: మండలంలోని సూరారం గ్రామ శివారులో చి రుత పులి కలకలం రేపుతోంది. చిరుత సంచారంతో పరిసర గ్రామాల ప్ర జల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఐదు రోజుల క్రితం పాతగూడూర్‌, పడ్కల్‌ శివారులో చిరుతపులి సంచరిస్తుందనే వార్త వ్యాపించడంతో చు ట్టు పక్కల రైతులు పంట పొలాలకు వెళ్లడానికి భయపడ్డారు. అటవీ శా ఖ అధికారులు అడుగు గుర్తులను పరిశీలించి చిరుతపులి కాదని అది హైనా అడుగులని అటవీశాఖ అధికారులు నిర్ధారించడంతో ప్రజలు ఊపి రి పీల్చుకున్నారు. కానీ సూరారం శివారులో చెరువు మత్తడి ప్రాంతంలో అడుగులను గుర్తించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇ చ్చారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన డీఆర్‌వో పద్మ పీవోపీ పరీక్ష నిర్వ హించి చిరుత అడుగులేనని నిర్ధారించారు. సోమవారం సంఘటనా స్థలా న్ని అటవీశాఖ ఉన్నత స్థాయి అధికారులు చీఫ్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ సీసీఎఫ్‌ బాసర శరవానంద్‌, జిల్లా పారెస్ట్‌ అధికారి వెంకటేశ్వర్‌రావు, ఎఫ్‌ ఆర్‌వో శ్రీనాథ్‌లు సందర్శించి చిరుత అడుగు గుర్తులను పరిశీలించారు. ఎ నిమల్‌ ట్రాకర్లు రమేష్‌, వంశీ, ట్రాప్‌ వైర్‌ లెస్‌ ఎన్‌జీవో వెంకట్‌లు ఆ ప్రాంతాన్ని గాలించినప్పటికీ చిరుత జాడ కనిపించలేదు. దీంతో చిరుత జాడ కనిపెట్టడానికి నాలుగు ట్రాక్‌ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీఆర్‌ వో పద్మ తెలిపారు. చిరుత ఆ ప్రాంతంలో ఉందా? లేదా? ఇక్కడి నుం చివెళ్లిపోయి ఉంటుందా? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ చి రుత ఉంటే కెమెరాలు చిరుత సంచారాన్ని బంధిస్తాయని, కెమెరాలో ఉ న్న ఫొటోల ఆధారంగా చిరుత జాడ కనిపెడతామని ఆమె తెలిపారు. మొత్తానికి చిరుత పులి సంచరిస్తుందనే వార్తతో సూరారంతో పాటు పరి సర గ్రామాల ప్రజల్లో భయాందోళన నెలకొన్నది. ఏది ఏమైనా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రజా ప్రతినిధులు, అటవీశాఖ అధికా రులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ సంధ్య, వాచ ర్‌ రాజేంధర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Read more