న్యాయవాదుల నిరసన ర్యాలీ

ABN , First Publish Date - 2022-08-17T05:43:55+05:30 IST

న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ గోదావరిఖని బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు.

న్యాయవాదుల నిరసన ర్యాలీ
బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న న్యాయవాదులు

కోల్‌సిటీ, ఆగస్టు 16: న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ గోదావరిఖని బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ కోర్టు కాంప్లెక్స్‌ నుంచి కార్పొరేషన్‌ జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం సామూహిక జాతీయ గీతాలాప న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు సీహెచ్‌ శైలజ, ప్రధాన కార్యదర్శి జవ్వాజి శ్రీనివాస్‌ సభ్యులు పాల్గొన్నారు. 

Read more