కేటీఆర్‌ చార్మినార్‌ నుంచి పోటీ చేయాలి

ABN , First Publish Date - 2022-09-19T06:02:50+05:30 IST

తెలంగాణ విమోచన దినం విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓట్ల రాజకీయం చేస్తోందని, దమ్ముంటే కేటీఆర్‌ సిరిసిల్లలో రాజీనామా చేసి చార్మినార్‌ నుంచి పోటీ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సవాల్‌ విసిరారు.

కేటీఆర్‌ చార్మినార్‌ నుంచి పోటీ చేయాలి
ప్రసంగిస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

- విమోచన దినం విషయంలో కేసీఆర్‌ మాట మార్చారు

- ఎమ్మెల్యే రఘునందర్‌రావు

జ్యోతినగర్‌, సెప్టెంబరు 18 : తెలంగాణ విమోచన దినం విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓట్ల రాజకీయం చేస్తోందని, దమ్ముంటే కేటీఆర్‌ సిరిసిల్లలో రాజీనామా చేసి చార్మినార్‌ నుంచి పోటీ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సవాల్‌ విసిరారు. ఆదివారం ఎన్టీపీసీలో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన తెలం గాణ విమోచన దినోత్సవంలో రఘునందన్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిం చారు. ఒకవర్గం ఓట్లను పొందాలనే స్వార్థంతో కేసీఆర్‌తెలంగాణ విమోచనా దినోత్స వాన్ని అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. ఎంఐఎం చెప్పుచేతల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వం నడుస్తోందని, కాదంటే కేటీఆర్‌ రిజైన్‌ చేసి పాతబస్తీ నుంచి పోటీ చేయాలని డిమాండ్‌ చేశారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్నివర్గాల శ్రేయ స్సు కోసం బీజేపీ పని చేస్తుంటే, బీజేపీని మతపిచ్చి పార్టీగా కేసీఆర్‌ తప్పుడు ఆరో పణలు చేస్తున్నారన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 13నెలల ఆలస్యంగా తెలంగా ణకు స్వాతంత్రం వచ్చిందన్నారు. 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ నిజాం సం స్థానం భారత దేశంలో విలీనం అయిందని ఆయన గుర్తుచేశారు. ఉద్యమ కాలంలో తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేసిన ఆనాటి ఉద్యమకారుడు కేసీఆర్‌, అధికారంలోకి రాగానే మాట మార్చాడని విమర్శిం చారు. ముస్లిం ఓట్ల కోసం, ఎమ్మెల్యే సీట్ల కోసం ఆరాటపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమోచన దినం విషయంలో ప్రకటన చేయగానే జాతీయ జెండాను పట్టు కున్నాడని ఎద్దేవాచేశారు. అమిత్‌షా ప్రకటనకు కంగుతిన్న కేసీఆర్‌ ఏడాదికి ముం దే తెలంగాణకు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నాడన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్‌ 17ను అధికారికంగా తెలంగాణ విమోచనాదినంగా ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. 8 ఏళ్లుగా కేసీఆర్‌ ప్రజలను అన్ని రకాలుగా వంచిస్తున్నాడని ఆరోపించారు. జాతీయ జెండాను ఎగురవేయని రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ గు ర్తించి గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో హిందూ వాహిని రాష్ట్ర సంయోజకుడు హరిచంద్రరెడ్డి, పెద్దపల్లి పార్లమెంట్‌ కన్వీనర్‌ మల్లికార్జున్‌, నాయకులు కౌశిక హరి, అమరేందర్‌రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-19T06:02:50+05:30 IST