కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2022-09-28T05:25:14+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ నిస్వార్థ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకం
లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం వద్ద నివాళులర్పిస్ను కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

- కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 27: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ నిస్వార్థ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. మంగళవారం కొండా లక్ష్మణ్‌ బాపూజీ 107వ జయంతి సందర్భంగా ఉజ్వల పార్కు సమీపంలోని ఆయన విగ్రహానికి కలెక్టర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్ఫూర్తితో దేశ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని అదే విలువలను జీవితాంతం పాటించారన్నారు. కార్యక్రమంలో మేయర్‌ వైసునీల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, ్లపద్మశాలి సంఘ జిలా గౌరవ అధ్యక్షుడు వాసాల రమేశ్‌, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, ప్రధాన కార్యదర్శి వి కృష్ణ, వలస భద్రయ్య, గడ్డం శ్రీరాములు, సత్యనారాయణ, జి శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 

Read more