గ్రామస్థులు చూస్తుండగానే హత్య

ABN , First Publish Date - 2022-08-16T07:10:22+05:30 IST

చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో సోమవారం మహిళను ఆమె భర్త అతిదారుణంగా గ్రామస్థులు చూస్తుండగానే గొంతు కోసి హత్య చేశాడు.

గ్రామస్థులు చూస్తుండగానే హత్య
భర్త కనకం ప్రవీణ్‌తో శిరీష (ఫైల్‌)


 భార్య గొంతు కోసిన భర్త 

 ఇందుర్తిలో దారుణం


చిగురుమామిడి, ఆగస్టు15: చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో సోమవారం మహిళను ఆమె భర్త అతిదారుణంగా గ్రామస్థులు చూస్తుండగానే గొంతు కోసి హత్య చేశాడు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందుర్తికి చెందిన కనకం ప్రవీణ్‌, శంక రపట్నం మండల కేంద్రానికి చెందిన ఆరేపల్లి రవీందర్‌ కూతురు శిరిషను (30)ను తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగు తున్నాయి. దీంతో శిరీష తన తల్లిగారి ఊరైన శంకరపట్నంలో ఉంటోంది. శిరీష గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా విధులు నిర్వహి స్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆమె అంగన్‌వాడీ కేంద్రంలో వేడుకలకు హాజరైంది. అక్కడే పొంచి ఉన్న ప్రవీణ్‌ జెండా పండుగ అనంతరం శిరీషను అంగన్‌వాడీ కేంద్రం నుంచి కొద్ది దూరం ఈడ్చుకువెళ్లాడు. కొద్ది దూ రం తీసుకెళ్లి  కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. సంఘటన జరిగిన కొద్ది దూరంలోనే కొంతమంది గ్రామస్థులు ఉన్నారు. వారు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని కత్తితో బెదిరించాడు. ప్రాణంపోయే వరకు నోరు మూసి పట్టుకుని నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. సంఘటనా స్థలాన్ని సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సై దాస సుధాకర్‌ పరిశీలించారు. శిరీష తండ్రి రవీందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Read more