రజాకార్లు, నిజాం అడుగుజాడల్లోనే కేసీఆర్‌ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-09-19T05:36:40+05:30 IST

రజాకార్లు, నిజాం అడుగుజాడల్లోనే కేసీఆర్‌ ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు.

రజాకార్లు, నిజాం అడుగుజాడల్లోనే కేసీఆర్‌ ప్రభుత్వం

 - బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి 

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 18: రజాకార్లు, నిజాం అడుగుజాడల్లోనే కేసీఆర్‌ ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. ఎంఐఎం ఆదేశాలకు తలొగ్గి నిజాం, రజాకార్ల ఆకృత్యాల చరిత్రను ప్రజలకు తెలియజేయకుండా, అమరుల త్యాగాలను స్మరించి, గుర్తు చేయకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొక్కుబడిగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తోందని విమర్శించారు. బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో నల్లబ్యాడ్జీలు, నల్ల జెండాలతో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విమోచనం రోజున తెలంగాణ అమరవీరుల త్యాగాలను కూడా గుర్తు చేసుకోనందుకు కేసీఆర్‌ తలదించుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, బత్తుల లక్ష్మీనారాయణ, జిల్లా ఆఫీస్‌ సెక్రేటరీ మాడుగుల ప్రవీణ్‌, మీడియా కన్వీనర్‌ కటకం లోకేష్‌, జిల్లా కోశాధికారి వైద రామానుజం, జిల్లా నాయకులు పాల్గొన్నారు. 

Read more