ముస్లింల సంక్షేమానికి కేసీఆర్‌ సర్కారు పెద్దపీట

ABN , First Publish Date - 2022-10-12T05:13:42+05:30 IST

రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి కేసీఆర్‌ సర్కారు పెద్దపీట వేసిందని, ముస్లిం మైనార్టీలు విద్య, సామాజికంగా ఎదిగేందుకు అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ పేర్కొన్నారు.

ముస్లింల సంక్షేమానికి కేసీఆర్‌ సర్కారు పెద్దపీట
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న హోం మంత్రి మహమూద్‌ అలీ

- హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ

జ్యోతినగర్‌, అక్టోబరు 11 : రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి కేసీఆర్‌ సర్కారు పెద్దపీట వేసిందని, ముస్లిం మైనార్టీలు విద్య, సామాజికంగా ఎదిగేందుకు అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ పేర్కొన్నారు. మంగళవా రం ఎన్టీపీసీలోని ఓ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన ముస్లిం మైనార్టీల సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గతంలో ఏ ప్రభు త్వాలు ముస్లింను పట్టించుకోలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 65 సం వత్సరాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు మైనార్టీ లను ఓటుబ్యాంకులుగానే భావించాయన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముస్లింల శ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాడని తెలిపారు. పేదరికంలో ఉన్న ముస్లింల పిల్లలకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ రాష్ట్రంలో 204 మైనార్టీ గురుకులాలను ప్రారంభించారన్నారు. ఈ గుకులాలలో లక్షా 40 వేల మంది ముస్లింపిల్లలకు నాణ్యమైన విద్యతోపాటు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో 75రూపాయలు, 200 రూపా యలున్న పెన్షన్‌ మాత్రమే గత ప్రభుత్వాలు ఇచ్చాయని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వివిధ వర్గాలకు 2016 రూపాయలు అందిస్తోందన్నారు. షాదీ ముబారక్‌ పథకం కింద ఇప్పటివరకు లక్షలాది పేద ముస్లిం అమ్మాయి లకు సర్కారు కోట్లాది రూపాయలు అందించిందన్నారు. గతంలో ముస్లిం మతపెద్దలు ఇమాం, మౌజంలను ఎవరూ పట్టించుకోలేదని, అయితే కేసీఆర్‌ ఇమాంలకు నెలకు 10 వేల రూపాయల గౌరవ వేతనం అంది స్తున్నారని మహమూద్‌ అలీ చెప్పారు. రాష్ట్రంలో రంజాన్‌ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నామని, పేద ముస్లింలకు దుస్తులు అందజే స్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడేందుకు ప్ర భుత్వం కృషి చేస్తోందని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నా మని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో అరాచకాలు జరుగుతాయ ని కొన్ని శక్తులు ప్రచారం చేశాయని, అయితే ఆ అనుమానాలను పటా పంచలు చేస్తూ లాఅండ్‌ఆర్డర్‌ను కాపాడామన్నారు. రామగుండం నియో జకవర్గంలో మైనార్టీలకు సంబంధించి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని, షాదీఖాన నిర్మాణానకి తన నిధి నుంచి 15లక్షల రూపా యలు ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీ వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్యే కోరకంటి చందర్‌, పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, ఇతర ప్రజాప్రతినిధులు, మైనార్టీ నాయకులు, టీఆర్‌ ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

Read more