రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన సాగుతోంది

ABN , First Publish Date - 2022-03-16T06:05:04+05:30 IST

రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన కొన సాగుతోందని, కేసీఆర్‌ పాలనకు పతనం ప్రారంభమైందని బీజేపీ నేత, మాజీ ఎంపీ గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన సాగుతోంది
పార్టీలో చేరుతున్న వారికి కండువా కప్పుతున్న వివేక్‌

- బీజేపీ నేత వివేక్‌వెంకటస్వామి 

మంథనిరూరల్‌, మార్చి 15: రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన కొన సాగుతోందని, కేసీఆర్‌ పాలనకు పతనం ప్రారంభమైందని బీజేపీ నేత, మాజీ ఎంపీ గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. మండలంలోని బిట్టుప ల్లి గ్రామంలో బీజేపీ జెండాను మంగళవారం ఆయన అవిష్కరించంతో  పాటు పలువురు పార్టీలో చేరగా కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానిం చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగిస్తోందన్నారు. రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌ రూంఇళ్ళను అర్హులైన పేద ప్రజలకు అందజేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రైతువేదికలు, శ్మశానవాటికలు, రోడ్లు నిర్మా ణాలు చేపట్టిందన్నారు. బీజేపీ నేత చుంద్రుపట్ల సునీల్‌రెడ్డి మాట్లా డుతూ మంథని ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసింది శూన్యమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు చిలువేరి సతీష్‌, పోతర వేన క్రాంతి, సబ్బని సంతోష్‌, రాజు, బాపు, రాజేందర్‌, మదూకర్‌, సత్య ప్రకాష్‌, సదాశివుడులు పాల్గొన్నారు. 

Read more