పేదింటి ఆడబిడ్డలకు వరం ‘కల్యాణలక్ష్మి’

ABN , First Publish Date - 2022-09-11T05:20:46+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ పథకం పేదింటి ఆడబిడ్డలకు వరంలాంటిదని జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు అన్నారు.

పేదింటి ఆడబిడ్డలకు వరం ‘కల్యాణలక్ష్మి’
చెక్కు అందజేస్తున్న జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు

ఎల్లారెడ్డిపేట, సెప్టెంబరు 10: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ పథకం పేదింటి ఆడబిడ్డలకు వరంలాంటిదని జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌ గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కల్యాణలక్ష్మి చెక్కులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. పేదింటి తల్లిదండ్రులకు ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కాకూడదని భావించిన సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముభారక్‌ పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అమృత, ప్యాక్స్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్‌ ఎల్లయ్య, పంచాయతీ కార్యదర్శి సంపత్‌, నాయకులు రాజమల్లు, చిన్నన్న, నాగరాజు, బాల్‌రెడ్డి, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more