మంత్రి దృష్టికి కాల్వశ్రీరాంపూర్‌ ఆసుపత్రి సమస్యలు

ABN , First Publish Date - 2022-05-24T05:43:54+05:30 IST

కాల్వశ్రీరాంపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలను వైద్య శాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళతానని ఐడీసీ మాజీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి అన్నారు.

మంత్రి దృష్టికి కాల్వశ్రీరాంపూర్‌ ఆసుపత్రి సమస్యలు
ఆసుపత్రిని పరిశీలిస్తున్న ఈద శంకర్‌రెడ్డి

- ఐడీసీ మాజీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి

కాల్వశ్రీరాంపూర్‌, మే 23: కాల్వశ్రీరాంపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలను వైద్య శాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళతానని ఐడీసీ మాజీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో సమస్యలను డాక్టర్‌ శ్రీనివాస్‌ను అడిగితెలుసుకున్నారు. హాస్పిటల్‌లో పనిచేయని ఎక్స్‌రే, ల్యాబ్‌, బెడ్లతో పాటు రోజూ వచ్చే రోగుల రిజిష్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈద శంకర్‌రెడ్డి మాట్లాడుతూ 1972లో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న దివంగత జిన్న మల్లారెడ్డి ఆసుపత్రిని నిర్మింపచేశారన్నా రు. మాజీ ఎమ్మెల్యే కాల్వరామచంద్రారెడ్డి తన భూమిని ఆసుపత్రి కోసం ఇచ్చారని, అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి శంకుస్థాపన చేశారని తెలిపారు. తాను ఎంపీపీగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని కోరగా 24గంటలు వైద్య సేవలందించే ఆసుపత్రికిగా మార్చారన్నారు. చుట్టుపక్కల మండలాల రోగులు చికిత్స కోసం వచ్చేవారని, కానీ ఇప్పుడు ఆసుపత్రి సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని మంత్రి హరీష్‌రావుకు వివరించానన్నారు. దీంతో హరీష్‌ రావు సంబంధిత అఽదికారులతో ఆసుపత్రి సమస్యలు తీసుకుని ని వేదిక ఇవ్వాలని కోరడంతో, అధికారులు ఆసుపత్రిని సందర్శించార ని తెలిపారు. వారితో పాటు సందర్శించానని, ఆసుపత్రిలో సమస్యలను మంత్రికి వివరించడంతోపాటు మహిళా డాక్టర్‌ నియామకం, భవన నిర్మాణాల కోసం మంత్రికి వివరిస్తానన్నారు. అనంతరం ఉషన్నపల్లిలో జరిగిన శ్రీదేవి, భూదేవి, బొడ్రాయి ఊరి కొలుపు పండుగకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బైరం రమేష్‌, మాజీ ఎంపీటీసీ పొట్టియాల మొండయ్య, కాల్వ వే మారెడ్డి, సంపత్‌, సతీష్‌ పాల్గొన్నారు. 

Read more